భార్యను వేధించిన కేసులో భర్తకు ఒక సంవత్సరం జైలు శిక్ష
లేదా రూ.1,000/- జరిమానా విధించిన గౌరవ IV AJFCM కోర్టు*
చిత్తూరు II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు కత్తితో దాడికి యత్నించి, హత్య చేస్తానంటూ బెదిరించిన కేసులో నిందితుడిని న్యాయస్థానం దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు పట్టణంలోని సంతపేట, ఓల్డ్ బ్రాహ్మిన్ స్ట్రీట్‌కు చెందిన వి. మౌనిక (25) తన భర్త కె. శరవణ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో చిత్తూరు II టౌన్ పోలీస్ స్టేషన్లో Cr.No.41/2024 U/s 498(A), 323, 506 IPC కింద కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా, 05-02-2024న మధ్యాహ్నం సుమారు 02:20 గంటలకు నిందితుడు ఫిర్యాదుదారు పనిచేస్తున్న సంతపేటలోని దేవా స్వీట్ స్టాల్ వద్దకు కత్తితో వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు, అనంతరం ఆమెను హత్య చేస్తానంటూ బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న నందిని మరియు పాయని మాస్టర్ జోక్యం చేసుకుని నిందితుడిని అక్కడి నుంచి పంపించారు.
ఈ ఘటనపై చిత్తూరు II టౌన్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసు చిత్తూరులోని గౌరవ IV AJFCM కోర్టులో విచారణకు వచ్చింది. ఈరోజు కేసులో తీర్పు వెలువడగా, గౌరవ న్యాయమూర్తి శ్రీ జి. సురేష్ బాబు గారు నిందితుడిని దోషిగా నిర్ధారించి, Cr.P.C. 248(2) ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.1,000/- జరిమానా విధించారు.
ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన చిత్తూరు II టౌన్ పోలీసులను, కేసు విచారణను నిరంతరం పర్యవేక్షించిన కోర్ట్ మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ S.K. ఖాదర్ మొహిద్దీన్ (HC-2978) గారిని, కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీ మనోహర్ మరియు గౌరవ న్యాయస్థానంలో కేసును సమర్థవంతంగా వాదించిన Addl. PP శ్రీమతి సి. స్వాతి గార్లను జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు అభినందించారు.

No comments:
Post a Comment