భారీ బందోబస్తు మధ్య వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రారంభం
వినాయక సాగర్ లో నగరపాలక సంస్థ అధికారుల ఏర్పాట్లు
నిమజ్జనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు : విజ్ఞాలను తొలగించే వినాయక చవితి వేడుకలను ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారని.. నిమజ్జన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. సోమవారం సాయంత్రం కట్టమంచి చెరువు వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మట్టి వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు నగరానికి సంబంధించి కట్టమంచి చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి నగరపాలక సంస్థ, పోలీసులు, గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ జలాశయం నుంచి నీటిని పంపు చేసినట్లు చెప్పారు. ప్రజలు, యువత తగిన జాగ్రత్తలతో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


No comments:
Post a Comment