Sunday, 13 September 2026

కాణిపాకంలో వినాయక చవితికి సర్వం సిద్ధం

కాణిపాకం లో వినాయక చవితి రోజు ఉదయం 3 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం 

- ఆలయ ఈవో పెంచల కిషోర్ 

- చైర్మన్ మణి నాయుడు 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

   శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి  దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేశామని, సర్వం  సిద్ధం చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణధికారి పెంచల కిషోర్,  దేవస్థానం చైర్మన్ మణి నాయుడు తెలిపారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సామాన్యులు భక్తులకు పెద్దపీట, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనం, రేపు వినాయక చవితి రోజు ఉదయం 3 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం, అన్నదానం, ఉచిత ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు, సర్వం సిద్ధం బ్రహ్మోత్సవ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా శానిటేషన్, తాగునీరు, క్యూలైన్లు, ఏర్పాట్లు చేయడమైనది, పోలీసు శాఖ వారు 370 మందితో వినాయక చవితి రోజున బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. 



1000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 

కాణిపాకం ఆలయ ప్రాంగణంలో కల్లూరు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పరిసర ప్రాంతాల ప్రజలకు 1000 మట్టి వినాయక విగ్రహాలను కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, నిమజ్జనం చేసేటప్పుడు బంక మట్టి వినాయక విగ్రహాలు నీటిలో పూర్తిగా కరిగిపోతుందని తద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు , ఆలయ సూపర్డెంట్ కోదండపాణి , సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment