Wednesday, 16 September 2026

నడక దారి భక్తులకు ఉచిత అన్నదానం

 నడక దారి భక్తులకు ఉచిత అన్నదానం 

తరిగొండ వెంగమాంబ ట్రస్ట్ సేవలు 

కట్టమంచి శాంత రఘురామ కళ్యాణమండపం లో ఏర్పాట్లు 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

పెరటాసి నెల ప్రారంభం అయింది.. తమిళనాడు కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన తిరుమలకు వెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కర్ణాటక తమిళనాడు నుండి చిత్తూరు మీదుగా తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు విడిది కేంద్రంగా తరిగొండ వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని కట్టమంచి శాంతా రఘురామ కళ్యాణ మండపం గత నాలుగు సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా తరిగొండ వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు మూడు పూటలా అన్నదానంతోపాటు వారు స్నానం చేయడానికి రాత్రి బస చేయడానికి అవసరమైన అన్ని రకాలైన సౌకర్యాలను శాంతా రఘురామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు నళిని తిరు కుమరన్, మళ్లీ ఆచారి, ఈశ్వర్, హరి ప్రసాద్, వడివేలు, తదితరులు మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలుగా తిరుమల నడకదారి భక్తులకు నిర్విరామంగా అన్నదానంతో పాటు అన్ని రకాలైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. నగరంలోని దాతలు సైతం కూరగాయలు పప్పు బియ్యము వంటి అన్ని రకాలైన వంట సామాగ్రిని వితరణ చేస్తూ ఆదరిస్తున్నారని ఈ ఏడాది కూడా ఆదరాభిమానాలు  కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు నెల రోజులపాటు నిర్వహిస్తామని తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment