అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
90 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు,3 బైకులు స్వాధీనం
-డి.ఎస్.పి వెంకటనారాయణ
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
దొంగతనాలకు పాల్పడుతున్న ఐదు మంది అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 90 లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ తెలిపారు. ఆదివారం పోలీసు అతిథి గృహంలో కల్లూరు సీఐ జయరామయ్య ఎస్సై వెంకటేశ్వర్లు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 17వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుంగనూరు రోడ్డులో ఉన్న శ్రీకృష్ణ జువెలర్స్ దుకాణంలో తాళాలు పగలగొట్టి 314 గ్రాముల బంగారు 20 కిలోల వెండి ఆభరణాలను అపహరించగా , బాధితుల ఫిర్యాదు మేరకు కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సెప్టెంబర్ 19వ తేదీన పాలసముద్రం మండలం వెంగళరాజ కుప్పం పంచాయతీ పరిధిలోని దీన బందాపురం గ్రామంలో ఐదు మంది నిందితులను సాయంత్రం నాలుగు గంటలకు అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణలో భాగంగా పాలసముద్రం మండలంలోని జయలక్ష్మి పురంలో గంగాధర నెల్లూరు మండలంలోని నెల్లెపల్లి గ్రామంలో తవణంపల్లి మండలంలోని దిగువ మాగం గ్రామంలో కల్లూరు శ్రీకృష్ణ జువెలరీస్ లో దొంగతనాలకు పాల్పడి ఆ వస్తువులను కొంత భాగాన్ని వేలూరు చెన్నై ప్రాంతాలలో విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు విలాసాలకు ఖర్చు చేసినట్లు దొంగలు వెల్లడించినట్లు తెలిపారు. మొత్తం బంగారు ఆభరణాలు 44 గ్రాములు వెండి వస్తువులు 17 కిలోలు ద్విచక్ర వాహనాలు మూడు స్వాధీనం చేసుకోగా ఇందులో మార్కెట్ విలువ 90 లక్షలు గా నిర్ధారించారు. నిందితులు పాలసముద్రం మండలం కనికాపురం హరిజనవాడ కాలనీకి చెందిన దినేష్ (25) తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాకు చెందిన బాలయ్య చిరంజీవి (34), తిరువల్లూర్ జిల్లాకు చెందిన జగన్ (19) తిరువళ్లూరు జిల్లాకు చెందిన వసంత్ కుమార్ (19) పాలసముద్రాన్ని చెందిన సిలంబరసన్ (19) అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచ ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి వెంకటనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ ఇంటివద్ద దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు సెన్సార్ అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి కల్లూరు సీఐ జయరామయ్య ఎస్సై వెంకటేశ్వర్లు క్రైమ్ పార్టీ బృందాన్ని అభినందించారు

No comments:
Post a Comment