Saturday, 19 September 2026

పరిశుభ్ర చిత్తూరు కోసం కృషి చేద్దాం : ఎమ్మెల్యే

పరిశుభ్ర చిత్తూరు కోసం కృషి చేద్దాం

 "స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర" కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎంపీ, ఎమ్మెల్యే 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు : పరిశుభ్ర చిత్తూరు కోసం కృషి చేద్దామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. మూడవ శనివారం  "స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర" స్వచ్ఛతా హీ సేవ -2026 కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నగర్ కాలనీలో  అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందనన్నారు. ప్రజలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. గృహాల్లో తయారయ్యే వ్యర్థాలను తడి, పొడిగా వేరుచేసి అంది ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయ రాదని కోరారు. ఈ సందర్భంగా "స్వచ్ఛతా ప్రతిజ్ఞ" నిర్వహించారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment