Thursday, 17 September 2026

అవినీతి ఏడి సరెండర్ పై దివ్యాంగ జేఏసీ సంఘ నాయకుల హర్షం

 అవినీతి ఏడి సరెండర్ పై హర్షం 

దివ్యాంగుల జేఏసీ సంఘ నాయకులు 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

నిధులను దారి మళ్ళించి అక్రమాలకు, అవినీతికి  పాల్పడిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి వినోద్ ను ప్రభుత్వానికి సరెండర్ చేసినందుకు దివ్యాంగుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు కొలతల చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో పసుపు నీళ్లు తల్లి పుణ్యాహవచనం చేసి, అవినీతి మరకలు తొలగిపోవాలని శుద్ధిచేసి కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటి రూపాయలు జిల్లాలోని దివ్యాంగులకు అందవలసిన వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను దారి మళ్ళించి అక్రమంగా అవినీతికి పాల్పడుతూ తన ఖాతాలోకి మళ్లించుకున్నారని ఆరోపించారు. ఇదే విషయంపైన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఫిర్యాదు చేయడంతో పాటు, పలుమార్లు కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా విచారణ అధికారిగా సురేష్ ను, జెసి రాజేంద్ర ను నియమించి కాలయాపన లేకుండా అతనిని మాతృ శాఖకు సరైన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. దీంతోపాటు లోకాయుక్తను ఆశ్రయించి అవినీతికి పాల్పడిన నిధులను జిల్లాలోని దివ్యాంగులకు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా ఉన్న ఏడి పుల్లారెడ్డిని ఇన్చార్జిగా నియమించినట్లు వార్త కథలో వచ్చిందని రాబోయే ఏడీ కూడా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా దివ్యాంగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అవినీతిపైన అలుపెరగని పోరాటం చేస్తామని దివ్యాంగులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి దివ్యాంగ సంఘ సభ్యులు దివ్యాంగులు పాల్గొన్నారు









No comments:

Post a Comment