Tuesday, 8 September 2026

సేవా సంకల్పం అభియాన్ ఉత్సవాలు

 75 వ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని

ఘనంగా సేవ సంకల్పం అభియాన్ ఉత్సవాలు జరపాలి 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

 



భారతీయ జనతా పార్టీ సంస్థాగతం పర్వంలో భాగంగా మంగళవారం చిత్తూరు సెంట్రల్ మండల కార్యవర్గ సమావేశం సెంటర్ మండల అధ్యక్షులు జి షణ్ముగం ఆధ్వర్యంలో బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,మాజీ రాజ్యసభ సభ్యులు  దుర్గా రామకృష్ణ , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, సేవా సంకల్ప అభియాన్ చిత్తూరు జిల్లా ఇంచార్జ్ అట్లూరి శ్రీనివాసులు , కడప జిల్లా ఇన్చార్జి కొల్లా చిట్టిబాబు , నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఏసీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సెంట్రల్ మండల ఇంచార్జ్  బాబు పాల్గొని రానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ  75వ జన్మదినం పుష్కరించుకుని సేవా సంకల్పం అభియాన్ ఉత్సవాలు పెద్ద ఎత్తున సెంట్రల్ మండలంలో నిర్వహించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండలంలోని వివిధ మోర్చాల కమిటీలను, బూత్ కమిటీలను ఏర్పాటు పై దృష్టి సారించాలని ముఖ్య అతిధులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ రెడ్డి మస్తాన్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు ఢిల్లీ రాణి, యువ మోర్చా నాయకులు హేమంత్ చౌదరి మండల ప్రధాన కార్యదర్శులు కే శ్రీనివాసులు, ఈ ప్రసన్న కుమార్, మండల ఉపాధ్యక్షులు ఓంకార్, గుణశేఖర్, మధు మండల కార్యదర్శులు కలయివాని, శేఖర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆనంద తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment