Tuesday, 8 September 2026

NCC క్యాడెట్‌కు పతకం ప్రదానం

NCC క్యాడెట్‌కు పతకం ప్రదానం

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


చిత్తూరు స్థానిక గంగనపల్లి సంసిధ్ క్యాంఫర్డ్ CBSE పాఠశాలకు చెందిన NCC క్యాడెట్ బి. హిమినేష్ ఫైరింగ్ ఇంటర్ గ్రూప్ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.

ఈ సందర్భంగా 8-9-2026న నిర్వహించిన కార్యక్రమంలో NCC తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ నరేంద్ర కుమార్ గారు మరియు 35 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ ఏ. లోకనాథన్ గారు చేతుల మీదుగా బి. హిమినేష్‌కు పతకాన్ని అందజేశారు.

ఫైరింగ్ పోటీలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకువచ్చిన హిమినేష్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్ అభినందించారు. అలాగే పాఠశాల కేర్‌టేకర్  సి. రాజా  ఈ కార్యక్రమంలో పాల్గొని హిమినేష్‌ను అభినందించారు. 


విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో NCC కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్.వి గారు తెలిపారు.


ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది బి. హిమినేష్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

No comments:

Post a Comment