1,34,307 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది
9.10.26 నాటికి ఫైనల్ ఎలక్ట్రోలీ రోల్ సిద్ధం
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు సెప్టెంబర్,28:
SIR సంబంధించి కార్యక్రమం అమలులో భాగంగా 1,34,307 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు, సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి, విజయవాడలోని జిల్లా రోల్ అబ్జర్వర్‌గా మరియు డైరెక్టర్ బీసీ సంక్షేమ శాఖ డాక్టర్ A. మల్లికార్జున, జిల్లాకు సంబంధించిన SIR పక్రిపై జిల్లా కలెక్టర్ నివేదించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ వెంకటేష్, డిఆర్ఓ కే మోహన్ కుమార్ పాల్గొన్నారు, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,SIR కార్యక్రమం పటిష్టంగా అమలు చేయుచున్నామని తెలిపారు , అనహరులుగా 2489 ఓటర్లను(ineligible) గుర్తించడం జరిగిందని వివరించారు,
1,34,307 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది, క్షేత్రస్థాయిలో సంబంధిత బి ఎల్ వో లు సమగ్ర విచారణ జరిపి నోటీసులు జారీకు చేసి 1,31,818 మంది ఓటర్లను అర్హులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు,
జిల్లాల ఫొటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం వేగవంత చేయుచున్నామని. ఫారం-6, 1566,ఫారం-7,110,ఫారం-8,859 మంది ఓటర్లు పెండింగ్ ఉన్నారు, ఈనెల 30 తేదీ లోపల పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సలహాలు , సూచనలు తీసుకొని SIR కార్యక్రమం అమలు చేయుచున్నామని వివరించారు, రాష్ట్రంలో SIR అమలలో చిత్తూరు జిల్లా మూడో స్థానంలో ఉన్నదని
జిల్లా రోల్ అబ్జర్వర్ మల్లికార్జున తెలిపారు. అనంతరం నగిరి, చిత్తూరు, కుప్పం, పలమనేరు ఆర్డీవోలతో సర్ కార్యక్రమం అమలపై సమీక్షించారు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకట సునీల్,DPM మధుసూదన్, కలెక్టర్ ఎన్నికల ఎమ్మార్వో రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment