Monday, 31 August 2026

యువతి తో బైక్ లో వెళ్తున్నారా.... జాగ్రత్త ..!

 

యువతి తో బైక్ లో వెళ్తున్నారా.... జాగ్రత్త ..!

- మధురై ధర్మ శాసనం తీర్పు 

చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 


యువతితో బైక్లో వెళుతున్నప్పుడు యువకులు జాగ్రత్తలు పాటించకపోతే  ఇబ్బందుల్లో పడతారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల మధురై ధర్మశాసనం ఇచ్చిన ఓ తీర్పు. 



2018 మే 10వ తేదీన తమిళనాడు రాష్ట్రం తేని ప్రాంతానికి చెందిన గోపాల్ (19) అనే యువకుడు మరో యువతిని బైక్లో వెనకాల ఎక్కించుకొని రోడ్డుపైన వెళుతూ ఉండగా ఒక వన్ ఢీకొట్టడంతో కిందపడి యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కోల్పోయింది. ఈ ఘటన పైన యువకుని తల్లిదండ్రులు తేనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పూర్వాపరాలు పరిశీలించి 25 లక్షలు మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ దీన్ని సవాల్ చేస్తూ మదురై ధర్మశాసనాన్ని ఆశ్రయించారు. మద్రాస్ కోర్టు లోని మధురై ధర్మ శాసనం లో న్యాయమూర్తులు జస్టిస్ స్వామినాథన్, జస్ట్ సుమతి విచారణ జరిపించారు. ఇన్సూరెన్స్ కంపెనీ సంస్థ ప్రమాదానికి యువకుడు కూడా ఒక కారణమే అని వాదించింది. పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత జస్టిస్ లు " తెల్లవారి జామున జరిగిన ఈ ఘటనలో వాహనం సరైన మార్గంలో వెళ్తూ ఉన్నప్పటికీ  యువకుడు వెనకాల యువతిని కూర్చుని వెళ్లినప్పుడు... ఎవరికైనా ఉత్సాహం ఉంటుందని... ఈ నేపథ్యంలో కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉందని , ప్రమాద సమయంలో గోపాల్ నిర్లక్ష్యం కూడా కొంతమేరకు కనిపిస్తోందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాల్సిన నష్టపరిహారంలో 25% తగ్గించి చెల్లించాలని తీర్పునిచ్చింది.

వాహనాల తనిఖీలు నిర్వహించిన ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్ర

చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో వాహనాల తనిఖీలు – ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన - ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామచంద్ర 

చిత్తూరు : ఫస్ట్ న్యూస్ ఫర్ యు 

చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ పరిధిలోని పెనుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల RVS నర్సింగ్ కాలేజీ వద్ద సోమవారం రాత్రి చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్  రామచంద్ర  వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గుర్తించి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు.

అలాగే వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (DL), వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని వివరించారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని, మైనర్‌లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు, విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్  తెలిపారు.



నూతన ఎస్సైగా వెంకటసుబ్బయ్య

చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సి.వెంకట సుబ్బయ్య.

చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 



 సోమవారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో  నూతన ఎస్.ఐ గా బాధ్యతలను సి.వెంకట సుబ్బయ్య  స్వీకరించారు.అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి నీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూ టౌన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. సీఐ పర్యవేక్షణలో ఆయన సూచనల మేరకు స్టేషన్లో ఎలాంటి కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దొంగతనాలు దోపిడీలు జరగకుండా రాత్రి కత్తి నిఘాను మరింత పటిష్టంగా అమలు చేస్తామన్నారు. సమస్యల కోసం వచ్చే ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. 

ట్రాఫిక్ క్రమబద్దీకరణ : ఎస్సై మహేష్ బాబు

 గాంధీ సర్కిల్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

 ఎస్సై మహేష్ బాబు  

చిత్తూరు, ఆగస్టు 31: ఫస్ట్ న్యూస్ 4 యు 

 గాంధీ సర్కిల్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఎస్‌ఐ మహేష్ బాబు  ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్‌స్టాప్ వద్ద బస్సులు నిర్దేశిత ప్రదేశాల్లోనే నిలిపేలా డ్రైవర్లకు సూచనలు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

అదేవిధంగా వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై
అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు. పోలీసుల చర్యలతో గాంధీ సర్కిల్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గి వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి. ప్రజల సౌకర్యార్థం భవిష్యత్తులోనూ ఇలాంటి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. 


ట్రైనింగ్ పేరుతో లక్షల స్వాహా

 ట్రైనింగ్ పేరుతో లక్షల స్వాహా 


అంగన్వాడీలకు ఇవ్వని బిల్లులు 

స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి 

- యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ 

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 


అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి పేరుతో ఆరు రోజులు పాటు ట్రైనింగులు జరిపి వాటికి కావలసిన భోజనాలు మెటీరియల్ ట్రావెలింగ్ సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు వరకు బడ్జెట్ కేటాయించింది. అయితే ఈ బడ్జెట్లో ట్రైనింగ్ సందర్భంగా అంగన్వాడీలకు నాశ్రికం భోజనాలు పెట్టి మిగతా వాటి బిల్లు లు సంబంధిత అధికారులు లక్షల్లో స్వాహా చేసినట్లు తెలుస్తున్నది. వీటిపై విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో మూడు రోజులకు ఒకసారి మూడు రోజులు ఒకసారి మొత్తం ఆరు రోజులకు అన్ని ప్రాజెక్టులలో జ్ఞాన జ్యోతి పేరుతో అంగన్వాడీలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ సందర్భంగా చార్టులు, భోజనాలు ,చార్జీలు ఐదు రకాల వాటికి ప్రభుత్వం పట్టిక ఇచ్చి ఒక్కొక్క దానికి ఒక ధర నిర్ణయించి ఇవ్వడం జరిగింది. భోజనాలకి రోజుకి 200 రూపాయలు కేటాయించగా మధ్యాహ్నం ఒక పూట మాత్రమే పెట్టి నాసిరకమైన భోజనం పెట్టారు. చార్టులు మిగతా అలవెన్సులు ఏవి కూడా రాలేదు గతంలో అంగన్వాడీలకు శిక్షణ పూర్తి అయిన వెంటనే చార్జీలు ఇతర ఖర్చులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు శిక్షణ పూర్తయి వారం రోజులు అవుతున్న ప్రాజెక్ట్ అధికారులు బడ్జెట్ రాలేదని చెప్తున్నారు. బడ్జెట్ రాకపోతే అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు. జిల్లా నుంచి  ప్రాజెక్టు అధికారుల అకౌంట్కి జమ చేశారు. అయినా కిందిస్థాయిలో అంగన్వాడీలకు ఇవ్వకుండా  జిల్లాలో  2400 మంది వర్కర్లు ఉంటే  ఒక్కొక్కరికి  తక్కువ అంటే 600 రూపాయల లెక్కన లెక్క వేసిన 14 లక్షల పైన స్వాహా అయినట్లు తెలుస్తుంది. వేలకు వేలు జీతాలు తీసుకునే అధికారులే అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్న వారి నుండి బిల్లులు లేకుండా దోచుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి దాంట్లోనూ కమీషన్లు ఇవ్వందే ఐసిడిఎస్ లో పని జరగడం లేదు. పైన ఒకటి చెప్తారు కింద ఒకటి జరుగుతుంది అంగన్వాడీల సమస్యలపై జాయింట్ సమావేశం నిర్వహించమని పదేపదే అడుగుతున్న ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రతి చిన్న విషయంలోనూ కిందిస్థాయి వర్కర్లకు మెమోలు మీద మెమోలు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు తప్ప ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ ధనాన్ని ఇష్టారాజ్యంగా స్వాహా చేస్తున్న అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఐసిడిఎస్ కి జిల్లా చైర్మన్గా కలెక్టర్ ఉన్నప్పటికీ అవినీతిపై భరతం పడుతున్న కలెక్టర్ ఐ సి డి ఎస్ లో అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని అర్థం కావడం లేదు. వర్కర్ హెల్పర్ ఏదైనా చిన్న తప్పు చేస్తే భూతద్దంలో చూసే అధికారులు ఈ విధంగా వర్కర్లకు రావాల్సిన డబ్బులను లక్షలలో స్వాహా చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ బిల్లులపై విచారణ చేపట్టి అంగన్వాడీలకు రావలసిన డబ్బులను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు

దళిత ఆయమ్మకు న్యాయం చేయాలి

 జిల్లా కలెక్టర్ - జీ.డి.నెల్లూరు ఎమ్మెల్యే జోక్యం చేసుకొని 
దళిత ఆయమ్మ నిర్మల కు న్యాయం చేయాలి 
జిల్లా  కలెక్టర్ కార్యాలయం ముందు 
        - ఏఐటీయూసీ నిరసన 



చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 

 చిత్తూరు జిల్లా,కార్వేటినగరం మండలం, గోపిశెట్టిపల్లి పంచాయతీ,గోపీశెట్టిపల్లి దళితవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా ఆయమ్మగా పనిచేస్తున్న దళిత నిర్మలను రాజకీయ ఒత్తిడికి తలవగి 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆయమ్మ  తొలగించి వేరే ఒకరిని పెట్టడం అన్యాయమని సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో  ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.నాగరాజు,జిల్లా అధ్యక్షులు వి. సీ. గోపీనాథ్,ఏఐటియుసి గౌరవ సలహాదారులు కే.మణి, నగర కార్యదర్శి దాసరి చంద్ర, పి.రఘు లు పాల్గొన్నారు అధికారం మారినప్పుడల్లా  ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ సిబ్బంది వేధించడం ఇలాంటి వారి పట్ల  ఆడుకోవడం శోచనీయమన్నారు ఇలాంటి పద్ధతులకు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు

చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలి

 చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ గారికి ఏఐటీయూసీ విన్నతి 

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 

చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు 


ఈ సందర్భంగా ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు వి సీ గోపీనాథ్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పి.రఘు ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, కే.మణి,హెచ్. బాలాజీ రావు లు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు

ఈ సందర్భంగా గోపీనాథ్ రఘు  మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 రకాల చేతి  వృత్తి దారులు ఉన్నారని వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తీవ్రంగా విమర్శించారు 

చేతి వృత్తి దారుల సంక్షేమానికి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, చేతి వృత్తి దారులకు ఉప ప్రణాళికను ఏర్పాటు చేసి చట్టబద్ధతను కల్పించి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో నిధులను కేటాయించాలి, చేతి  వృత్తి దారులకు వయస్సుతో నిమిత్తం లేకుండా ఐదు లక్షల రూపాయలు 50% సబ్సిడీతో  బ్యాంకుల లింక్ లేకుండా సొంత  పూచీ కత్తుల తో కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయాలి, ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి, 50 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి చేతి వృత్తిదారులకు 6000 పెన్షన్ మంజూరు చేయాలి, చేతి వృత్తి దారుల పిల్లలు కు కే.జీ నుండి పి.జి వరకు ఉచిత విద్యను అందించాలి, అర్హత గల  ప్రతి చేతి వృత్తి దారునికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు లు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం


చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 

పట్టణంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు,  మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్పీ శ్రీ శ్రీనివాస రావు గారి ఆధ్వర్యంలో ఎస్‌.ఐ. శ్రీ సుబ్బా రెడ్డి గారు కార్మిక శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చిత్తూరు పట్టణము నందు నిర్వహించారు.


ఈ సందర్భంగా చిత్తూరు పట్టణంలోని షూ షాపులు, స్వీట్ షాపులు, హోటళ్లు, క్లాత్ షాపులు తదితర వ్యాపార సంస్థలను సందర్శించి, బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని నిర్వాహకులకు అవగాహన కల్పించారు. బాలలను పనిలో నియమించకుండా వారి విద్యాభ్యాసానికి, బాల్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. గారు మాట్లాడుతూ, ప్రతి బాలుడికి విద్య, ఆరోగ్యం, సురక్షితమైన బాల్యం పొందే హక్కు ఉందని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొన్నారు. బాల కార్మికులను గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

చైల్డ్ అండ్ అడోలెసెంట్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1986కు 2016లో చేసిన సవరణల ప్రకారం 14 సంవత్సరాల లోపు బాలలను పనిలో నియమించడం సాధారణంగా నిషేధించబడిందని, అలాగే 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కిశోరులను ప్రమాదకర వృత్తులు, ప్రక్రియల్లో నియమించడం నిషేధమని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ శాఖ, కార్మిక శాఖతో పాటు ప్రజలు, వ్యాపార సంస్థల నిర్వాహకులు కూడా సహకరించాలని ఎస్‌.ఐ. విజ్ఞప్తి చేశారు. బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు కార్మిక శాఖ వారు పాల్గొన్నారు.





CEFI డియోసెస్‌ వివాహాలకు ప్రభుత్వ గుర్తింపు*

 CEFI డియోసెస్‌ వివాహాలకు ప్రభుత్వ గుర్తింపు


చిత్తూరు, ఆగస్టు 31: ఫస్ట్ న్యూస్ 4 యు 

 చిత్తూరు జిల్లాలో CEFI డియోసెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే వివాహాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారిక గుర్తింపు, ఆమోదం లభించిందని డియోసెస్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సోమవారం CEFI డియోసెస్‌ చిత్తూరు జిల్లా బిషప్‌ డా. మేడిద రమేష్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్‌ డా. జి. జెరెమియా, నెల్లూరు జిల్లా బిషప్‌ డా. ప్రేమ్‌కుమార్‌ సదేపల్లి, తిరుపతి జిల్లా బిషప్‌ ఆశా మీనన్‌ కలిసి జిల్లా మ్యారేజ్‌ రిజిస్ట్రార్‌ ఈ. విజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా CEFI డియోసెస్‌కు ప్రభుత్వం గుర్తింపు, అనుమతి ఇస్తూ జారీ చేసిన అధికారిక పత్రాలను చిత్తూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్‌కు పాస్టర్లు బృందం అందజేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతికి సంబంధించిన స్పష్టత లేకపోవడంతో CEFI డియోసెస్‌ పరిధిలో పనిచేస్తున్న వివాహ రిజిస్ట్రార్లు కొన్ని పరిపాలనా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను పరిశీలించిన చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్‌.. గుర్తింపును ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. దీంతో వివాహ రిజిస్ట్రార్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు.

చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న CEFI డియోసెస్‌ వివాహ రిజిస్ట్రార్ల వివరాలు, సంబంధిత రికార్డులను అధికారిక రికార్డుల కోసం సమర్పించాలని జిల్లా రిజిస్ట్రార్‌ సూచించినట్లు ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లభించడంతో ఇకపై జిల్లాలో CEFI డియోసెస్‌ ఆధ్వర్యంలో జరిగే వివాహాలు అధికారిక పరిపాలనా ఆమోదంతో కొనసాగనున్నాయని వెల్లడించారు.

ఈ పరిణామంపై CEFI డియోసెస్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కమిటీ సెక్రటరీ వాసు లాజరస్‌, కోశాధికారి బి. జ్ఞానప్రకాశం, ఉపాధ్యక్షుడు సి. ఆరాధయ్య, జాయింట్‌ సెక్రటరీ శరత్‌కుమార్‌, పీఆర్వో సి. ప్రసాద్‌కుమార్‌, మీడియా కోఆర్డినేటర్‌ జె. ఉదయ్‌కుమార్‌తో పాటు CEFI డియోసెస్‌ వివాహ రిజిస్ట్రార్లు, పలువురు చర్చి ప్రతినిధులు పాల్గొన్నా

నెహ్రు నగర్కు వర్తించదా ?

 🍁 ప్రచురణార్థం

*స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర పథకాలు నెహ్రూ నగర్ కు వర్తించదా?*

*జనతా వారధి లో బిజెపి డిమాండ్*


చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 

 చిత్తూరు నగరం


లోని మిట్టూరు 29వ డివిజన్ నందు గల నెహ్రూ నగర్ లో దాదాపు ఒక సంవత్సరం నుండి అన్ని వీధుల ద్వారా వచ్చే మురికి నీరు డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేని కారణంగా ఒకచోట నిలిచిపోయి ఆ ప్రాంతమంతా దుర్గంధంగా తయారయింది. సరైన అవుట్ లెట్ లేని కారణంగా ఈ సమస్య ఏర్పడింది. 

 భారతీయ జనతా పార్టీ పలుమార్లు మునిసిపల్ అధికారులకు నివేదించిన తర్వాత కమిషనర్ , మునిసిపల్ సిబ్బంది నెహ్రూ నగర్ ప్రాంత పర్యటన చేశారు. తదుపరి జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. 

నేడు జనతా వారధి కార్యక్రమం ద్వారా బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ చిట్టిబాబు కొల్లా నగరపాలక కమిషనర్ ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కలిసి నెహ్రూ నగర్ కాలువ సమస్యను నివేదించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఏం జి రామభద్ర, పాండురంగం, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా టిడిపి నేత గంగావరపు గోపి నూతన గృహప్రవేశ వేడుకలు

 అంగరంగ వైభవంగా టిడిపి నేత గంగావరపు గోపి నూతన గృహప్రవేశ వేడుకలు 



 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం

ఫస్ట్ న్యూస్ 4 యు 


 పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు  గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు పూతలపట్టు మండల క్లస్టర్ ఇంచార్జ్ గంగారపు గోపి స్వగృహంలో నూతన గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగినది ముందుగా గణపతి పూజ కలసి పూజ నిర్వహించి అనంతరం సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగినది కార్యక్రమానికి అతిరథ మహారధులు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ 

కలికిరి మురళీమోహన్, సీకే లావణ్య, పలమనేరు శాసనసభ్యులు అమ్మనాథరెడ్డి,చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జిల్లా, నియోజకవర్గ,మండల కూటమి నాయకులు,కార్యకర్తలు,వివిధ పార్టీలకు చెందిన నాయకులు,గోపి కుటుంబ సభ్యులు,బంధువులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల హర్షం....

 *తెలుగు ప్రజల గుండె చప్పుడు వెలిగొండ ప్రాజెక్టు*

 .....*పైన దేవుడు ఆదేశిస్తాడు! కింద చంద్రబాబు నాయుడు పాటిస్తాడు*!!!


 చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల హర్షం....

చిత్తూరు :


ఫస్ట్ న్యూస్ ఫర్ యు 


ప్రకాశం జిల్లా మార్కాపూర్ లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుని ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేయడం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో రాయవలసిన అంశం అని చిత్తూరు జిల్లా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు .1996 మార్చి 5న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నోచుకోవడం... ఇది దేవుడు యొక్క ఆదేశం అని చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు అన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కృష్ణా జలాలు తరలించి అపర భగీరథుడయ్యాడని కొనియాడారు. దాదాపు 53.85 టీఎంసీల నీరుని  నిల్వ  చేయగల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుని సాధించి ప్రజలకు అంకితం చేయడం ఆనందదాయకమన్నారు.

 10200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు వలన 23 లక్షల మందికి తాగునీరు, అదే విధంగా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నడుం బిగించారని అన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజానీకానికి ఒక సంజీవని లాగా ఈ ప్రాజెక్టు నిలబడిందని అన్నారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో కనీసం రెండు శాతం పనులు కూడా పూర్తి చేయకుండా  వెలుగొండ ప్రాజెక్టుని అటకెక్కించారని అన్నారు. తమ సొంత జిల్లా అయిన కడపకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వైసిపి పాలన సాగిందని అన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు కోర్టు కేసులు వేసినప్పటికీ, కొండల్ని, గుట్టల్ని ,అడవుల్లో దాటుకొని కృష్ణా జలాల్ని కరువు సీమ ప్రకాశం జిల్లా, నెల్లూరు కడప జిల్లాకు తరలించినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు అని అన్నారు. అపర భగీరధులుగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర నిలిచిపోతాడని అన్నారు. ఈ ప్రాజెక్టుని ఈ ప్రాంత కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరుపైన నామకరణం చేయడం వాళ్ళ కుమార్తెలను పిలిచి సన్మానించి గౌరవించడం చరిత్రలో మర్చిపోలేని ఘటమని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, తెలుగు యువత నాయకుడు వినోద్ కుమార్, బంగారుపాలెం టిడిపి  నాయకుడు రాగిమానుపెంట మదన్ ,టిడిపి ఎస్సీ సెల్ నాయకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు

 

శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి

*శక్తి యాప్ డౌన్‌లోడ్లపై ప్రత్యేక దృష్టి – మహిళల భద్రతకు సాంకేతికతను మరింత చేరువ చేస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు*

*ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు*

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయాన్ని త్వరగా పొందేందుకు ఉపయోగపడే *శక్తి యాప్‌* ను ప్రతి మహిళకు చేరువ చేసేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.






చిత్తూరు జిల్లాలో శక్తి యాప్‌ డౌన్‌లోడ్లను పెంచే దిశగా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పోలీసు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో మహిళలు, విద్యార్థినులకు శక్తి యాప్‌ గురించి వివరించి, ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.


మహిళలు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు లేదా అత్యవసర సమయంలో పోలీసుల సహాయం కోరేందుకు శక్తి యాప్‌ ఉపయోగపడుతుంది. మహిళలు తమ భద్రత విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సమస్య ఎదురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.

జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, మహిళా కళాశాలలు, వసతి గృహాలు, కార్యాలయాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో శక్తి యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అత్యవసర సమయంలో ఎలా వినియోగించాలి అనే అంశాలను మహిళలకు, విద్యార్థినులకు వివరిస్తున్నారు.

అలాగే, మహిళా పోలీసులు మరియు శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మహిళలు, విద్యార్థినులతో మాట్లాడి శక్తి యాప్‌ ఉపయోగాలను వివరిస్తూ, ప్రతి మహిళ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

ప్రతి మహిళతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిచయస్తులైన మహిళలకు కూడా శక్తి యాప్‌ గురించి తెలియజేసి, వారితో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించేలా ప్రోత్సహించాలని జిల్లా పోలీసులు కోరుతున్నారు.

సాంకేతికతను సద్వినియోగం చేసుకుని మహిళలకు మరింత భద్రత, భరోసా కల్పించడమే చిత్తూరు జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం. ప్రతి మహిళ శక్తి యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన సమయంలో దాని సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీసులు సూచించారు.

సెప్టెంబర్ 1 నుండి పోలీస్ 30 యాక్ట్ అమలు

 సెప్టెంబర్ 1 నుండి పోలీస్ 30 యాక్ట్ అమలు 

సభలు సమావేశాలు అనుమతి లేకుండా నిర్వహించరాదు 

- 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య 


చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 

సెప్టెంబర్-1 నుండి 30 వ తేదీ వరకు చిత్తూరు నగరంలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెలరోజులపాటు చిత్తూరు నగరంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలు ఎవరైనా సరే సభలు సమావేశాలు నిర్వహించాలన్న ఇతర బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్న పోలీసుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు. రాజకీయ సభలు సమావేశాలు నిర్వహించాలంటే 72 గంటలకు ముందుగా పోలీసుల అనుమతి కోరుతూ విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు సమావేశాలు నిర్వహిస్తే 30 యాక్ట్ కింద వారి పైన కఠిన చర్యలు చేసుకుంటామని హెచ్చరించాడు. 



వినాయక చవితి సందర్భంగా....


వినాయక చవితిని పురస్కరించుకొని నగరంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. పండుగ సందర్భంగా వినాయక మండపాల వద్ద ఎలాంటి డీజేలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని భారీ స్పీకర్లతో పాటలు పెట్టడం ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా వినాయక మండపాల వద్ద ఎలాంటి నిషిద్ధ కార్యక్రమాలు నిర్వహించిన వారి పైన 30 యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు.

Sunday, 30 August 2026

వీడిన మిస్టరీ....!

 తమిళనాడులో ఆంధ్ర మహిళ హత్య కేసు చేదించిన పోలీసులు. 

నిందితుడు అరెస్ట్ ...!

నగరి : ఫస్ట్ న్యూస్ 4 యు 

వారం రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం , తిరువల్లూర్ జిల్లా వెల్లా కులం సమీపంలోని ఒక ముళ్ళ పొదల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలం  చవరంబాక్కం గ్రామానికి చెందిన అరుణపైన గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ చల్లి, గొంతు నులిమి చంపిన ఆనవాళ్లు కనిపించింది. తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. 


నిందితుడి ఆచూకీ :


      

       వద్దత్తూరు గ్రామంలోని బందుల పెళ్ళికి వచ్చిన అరుణ హత్యకు గురైంది. ఆమె సెల్ఫోన్ ఆధారంగా వద్దత్తూర్, తామరంబాకం, వెళ్ళాకులం తదితర ప్రాంతాలలో సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించారు. చివరికి ఆమెకు వచ్చిన సెల్ఫోన్ కాల్ ఆధారంగా భారతి రాజా (42) అనే నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఆమెకు భారతి రాజాకు మధ్య వివాహేతర సంబంధం గత కొంతకాలంగా నడుస్తోందని, వారం రోజుల క్రితం పెళ్ళికి వచ్చిన ఆమె అంతకుముందు తనకు ఇచ్చిన బంగారు నగలను తిరిగి అడగగా, ఇద్దరు మధ్య వివాదం మొదలైందని , కోపంతో ఆమె పైన యాసిడ్ చెల్లి గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. భారతి రాజాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

సప్త కన్నికలమ్మ ఆలయంలో దీప స్థంభం ప్రతిష్టాపన

సప్త కన్నికలమ్మ  ఆలయంలో నూతన దీపస్తంభం ప్రతిష్టాపన

చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 

చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లిలో వెలసిన శ్రీ సప్త కనికలమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన నూతన దీప స్థంభం ప్రతిష్ట, నాగలమ్మకు నూతన మండపం, శ్రీ నాగాలమ్మ  ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్  హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే కి ఘనంగా స్వాగతం పలికారు. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు.    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మీద అమ్మవారి కృపా కటాక్షం ఎప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆలయం ఎంతో శక్తివంతమైన ఆలయమని , భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ ఆలయం నిలిచిందన్నారు.





కార్యక్రమంలో ఆలయ చైర్మన్  బాలాజీ, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, స్థానిక నాయకులు నళిని తిరకుమరన్, అముద, రాజేష్ కుమార్ రెడ్డి, గోపాలకృష్ణ, కూటమి నాయకులు, ఉభయదారులు పాల్గొన్నారు.

--------//--------

కాజూరు గ్రామ దేవత ఆలయం చరిత్ర

 వందేళ్ళ చరిత్ర కలిగిన స్వయంభుగా వెలసిన గ్రామ దేవత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా...? 

ఒకే ఆలయంలో గ్రామ దేవత, గ్రామాన్ని చల్లగా చూస్తే గంగమ్మ తల్లి ఉన్నారంటే నమ్ముతారా ?

చిత్తూరులో పెనవేసుకున్న రావి చెట్టు వేప చెట్టు వద్ద స్వయంభుగా వెలసిన 100 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామ దేవత ఆలయం గురించి తెలుసుకుందాం !


చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 

        చిత్తూరు నగరంలో కాజూరు అంటే తెలియని వారు ఉండరు.. ఈ ప్రాంతం నుండి పలువురు ప్రముఖులు జిల్లాకు సుపరిచితులుగా ఉన్నారు. అందులో చెప్పుకోదగిన  కొందరు ఆ ప్రాంతం అభివృద్ధి కోసం తరతరాలుగా కృషి చేస్తున్నారు. అలాంటి కాజూరు 100 ఏళ్ళ క్రితం వేప రాగి చెట్టు పైన వేసుకొని ఉన్నచోట గ్రామస్తులకు రేణుకాంబ స్వయంభు విగ్రహం కంటబడింది. అప్పటినుండి గ్రామస్తులు స్వయంభుగా వెలసిన రేణుకాంబ విగ్రహాన్ని ఆ చెట్టు కింద పెట్టి గుడిలా మలచి పూజలు చేస్తూ వస్తున్నారు. కాజూరు  గ్రామస్తులు, ప్రముఖులు కలిసి గత కొన్ని ఏళ్ల క్రితం గ్రామదేవత రేణుకాంబ కు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వర్షాల కోసం , నీటి ఎద్దడి లేకుండా జిల్లాను సస్యశ్యామలంగా ఉంచడం కోసం ప్రార్థించే గంగమ్మ తల్లి శిరస్సు విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించారు. ఒకే ఆలయంలో ఇద్దరు తల్లులు ఉండడంతో ఈ ఆలయానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. 

ఆలయంలో నిర్వహించే తిరునాళ్లు :

  కాజూరు గ్రామ దేవత రేణుకాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు, శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు, ప్రతి శుక్ర మంగళవారాలలో ప్రత్యేక పూజలు,  అమ్మవారికి సంబంధించిన అన్ని పండుగలతో పాటు  ప్రతి ఏడాది వేసవి కాలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే గంగ జాతర వేడుకలు ఈ ఆలయం నుండే మొదలవుతుంది. గ్రామస్తులు ప్రముఖులతో కలిసి ఆనవాయితీగా గంగ జాతరను రేణుకాంబ గ్రామ దేవత ఆలయం నుండే నిర్వహిస్తారు. 




ఆలయ విశిష్టత :


   రాగి వేప చెట్టు పెనవేసుకొని ఉన్నచోట అమ్మవారు స్వయంభుగా వెలసి ఉండడంతో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా గ్రామస్తులు కొలుస్తూ వస్తున్నారు. చాలామంది భక్తులకు వారు కోరిన కోరికలు తీర్చిన దేవతగా నేటికీ చెబుతున్నారు. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, పదోన్నతులతోపాటు వివాహం, కుటుంబ కలహాలను తీర్చే దేవతగా గ్రామస్తులు నమ్ముతారు. మనసులో సంకల్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే వారు కోరుకున్న కోర్కెలు తీరుతాయి అనేది గ్రామస్తుల విశ్వాసం. 


20 ఏళ్లుగా అమ్మవారి సేవలో తరిస్తున్నాను 

-ప్రధాన అర్చకులు మణిశర్మ 


       దాదాపు 20 ఏళ్లుగా కాజూరు గ్రామ దేవత రేణుకాంబ ఆలయంలో ప్రధాన అర్చకులుగా అమ్మవారి సేవలో ఉన్నాను. ఎంతోమంది అమ్మవారి వద్దకు వచ్చి వారి కష్టాలను చెప్పుకొని పూజలు చేయగా , వారి కష్టాలు తొలగిపోయిందని అనంతరం వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పిస్తున్నారు. ప్రత్యక్షంగా నా అనుభవంలో చూశాను. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని కృపా కటాక్షానికి పాత్రులు కండి.





మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలి

 మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలి 



పర్యావరణాన్ని కాపాడాలి 

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ 


జిల్లాలో మట్టు మాఫియా ఇష్టారాజ్యంగా గుట్టలు గుట్టలన్నిటిని ధ్వంసం చేస్తూ మట్టిని రియల్ ఎస్టేట్ ప్యాట్లకు తరలిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నదని మట్టి మాఫియా పై చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నగిరి, జీడి నెల్లూరు, బంగారుపాలెం నియోజకవర్గాల్లో అత్యధికంగా మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. రియల్ ఎస్టేట్ ప్లాట్లకు ప్రభుత్వ స్థలాల్లో ఉన్న గుట్టలను ధ్వంసం చేసి రాత్రి పగలు తేడా లేకుండా హిటాచిలతో భారీ స్థాయిలో ట్రాక్టర్లతో ,ట్రిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. ఒకపక్క పర్యావరణ దెబ్బతింటు మరోపక్క చుట్టుపక్కల గ్రామస్తులు మట్టికి దుమ్ముదూళితో అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది .వారి వ్యాపారం కోసం ప్రభుత్వ, పేదల ఆస్తి అయినా గుట్టలను అక్రమంగా ఉచితంగా మట్టిని తరలిస్తూ ధ్వంసం చేస్తున్నారు .ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టి పట్టనట్లు ఉన్నారు పంచాయతీల ఆదాయాన్ని గడ్డి కొడుతూ కోట్లు గడిస్తున్న మట్టి మాఫియా పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఆయన ప్రశ్నించారు. దీని వెనక స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారని బహిరంగ రహస్యం. వారిని సంతృప్తి పరచడానికి అధికారులు ఆరాటడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ప్రజాప్రతినిధులందరూ గత ప్రభుత్వం అవలంబించిన ఇలాంటి మాఫియా పనులను వ్యతిరేకించిన ప్రస్తుత కూటమి పాలకులు నేడు యదేక్షగా వారి వ్యాపారాలను వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారనేది నగ్నసత్యం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై మట్టి మాఫియా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సిపిఎం గా వామపక్షాలుగా మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేసినప్పుడు ప్రకటన చేసినప్పుడు తూతూ మంత్రంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారే తప్ప చిత్తశుద్ధతో వాటిని అడ్డుకట్ట వేయడం లేదని ప్రశ్నించారు. మట్టి మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాకు అధికారులు అండ ప్రజా ప్రతినిధులు అండ ఉందని వారికి మేము మామూలు ఇస్తున్నామని బహిరంగంగా చెబుతూ అందరిని బెదిరిస్తున్నారు. ఇప్పటికే ఎల్ నిఓ ప్రభావం జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తుంటే భూగర్భ డ్రైనేజీ అడుగింటిపోతున్న రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది .దీనికి తోడు వీరు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ భవిష్యత్తును నాశనం చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా అధికారులు మట్టి మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు

పి.జి.ఆర్.ఎస్ పై క్యూ.ఆర్ కోడ్‌ ద్వారా స్పందన తెలియజేయండి

 పి.జి.ఆర్.ఎస్ పై క్యూ.ఆర్ కోడ్‌ ద్వారా స్పందన తెలియజేయండి


- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 


చిత్తూరు, ఆగస్టు 30 : ఫస్ట్ న్యూస్ 4 యు 


- *ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)పై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను మరింత పారదర్శకత, జవాబుదారీతనం దిశగాను, నిరంతర అభిప్రాయ సేకరణ చేసి పౌరుల సంతృప్తిని మెరుగుపరచడం, వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుండి అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు క్యూ.ఆర్ కోడ్‌ను ప్రదర్శించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో క్యూ.ఆర్ కోడ్ ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించారు. క్యూ.ఆర్ కోడ్‌ను స్పష్టంగా, కంటికి కనిపించే పరిమాణంలో ముద్రించి, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పౌరులు పి.జి.ఆర్.ఎస్ సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా క్యూ.ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని సమర్పించవచ్చని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో పౌరులు భాగస్వామ్యం అయ్యే విధంగా నోటీసు బోర్డులు, హెల్ప్ డెస్క్‌లు, ఫిర్యాదుల కౌంటర్లు, తదితర ప్రదేశాల్లో పెట్టాలని సూచించారు.*


- *క్యూ.ఆర్ కోడ్ వలన ప్రజల స్పందన అధికారిక పి.జి.ఆర్.ఎస్ పోర్టల్‌ https://pgrs.ap.gov.in/Home/QRGrievance Feedback కు చేరుతుందని అన్నారు.*


- *ఆర్జీల స్థితిగతులు తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ ను వినియోగించుకోవాలని, తమ అభిప్రాయాలను తెలియజేస్తూ మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.*


- *ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోను, మండల కార్యాలయాల్లోనూ నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ లో అర్జీలు అందించండి, వాటిపై మీ స్పందన క్యూ.ఆర్ కోడ్ ద్వారా తెలియజేయండి అని కోరారు.

ప్రశాంతంగా ముగిసిన NEET PG పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన NEET PG పరీక్ష 

ఫస్ట్ న్యూస్ 4 యు :

      ఆదివారం జరుగుతున్న NEET PG పరీక్ష నేపథ్యంలో చిత్తూరు నగరంలోని SVCET కాలేజీ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీమతి ఎస్. షాను గారు పరిశీలించారు.

పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, అభ్యర్థుల ప్రవేశం, నిష్క్రమణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు డ్రోన్ కెమెరాను కూడా వినియోగించారు. పరీక్షా కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ గారు పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పరీక్షా కేంద్రంలో నిబంధనలకు అనుగుణంగా అన్ని భద్రతా చర్యలు చేపట్టి, పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించారు.







Saturday, 29 August 2026

ఆన్లైన్ యాప్ ద్వారా అప్పుల పాలై...

 ఆన్లైన్ యాప్ ల ద్వారా అప్పుల పాలైన ఓ కుటుంబం బలన్మరణానికి పాల్పడింది. 



విజయనగరం (ఫస్ట్ న్యూస్ 4 యు):

విజయనగరం జిల్లా కుమ్మరిపేటకు చెందిన వినోద్ కుమార్ (35)ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. చింతల అగ్రహారానికి చెందిన అహల్య (25) తో 2019 లో వివాహమయ్యింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అత్యధిక సంపాదన కోసం ఆన్లైన్ యాప్ ల ద్వారా మోసపోయి అప్పుల పాలైనారు. రాఖీ పండుగ రోజు వినోద్ కుమార్ తన తోబుట్టువుల దగ్గరికి వెళ్ళాడు. రాఖీ పండుగ ఆనందంగా జరుపుకున్నారు. వినోద్ కుమార్ సోదరుడు అప్పుల విషయం తెలుసుకొని ఆందోళన చెందవద్దని అండగా నిలుస్తామని హామీ ఇచ్చాడు. అనంతరం శుక్రవారం రాత్రి పెందుర్తిలోని తన స్వగృహానికి భార్యాభర్తలు పిల్లలతో వచ్చారు. వినోద్ కుమార్ తన ఫోన్ స్టేటస్ లో ఫ్యామిలీ ఫోటో పెట్టి RIP అని ఎంబోసిలను పెట్టి పోస్ట్ చేశాడు. ఈ పోస్టును చూసిన మేనకోడలు వినోద్ కుమార్ సోదరునికి సమాచారం ఇచ్చింది. వినోద్ కుమార్ అహల్య తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అందరూ ఇంటికి వెళ్లి చూడగా అన్నంలో విషపూరితమైన పదార్థం కలుపుకొని భార్య పిల్లలు తినగా, వినోద్ కుమార్ ఉరివేసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. అందరూ విగత జీవిగా కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు. 


ఆన్లైన్ యాప్ ల ద్వారా మోసపోకండి 


తెలిసి తెలియకుండా ఆన్లైన్ యాప్ ల ద్వారా డబ్బులు ఎక్కువగా వస్తుందని ఆశపడి మోసపోవద్దని పోలీసులు సూచించారు. దీనివలన చాలా కుటుంబాలు సర్వస్వం కోల్పోతున్నాయని,  బెట్టింగ్లకు ఆన్లైన్ యాప్ లకు దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఒంటరి మహిళపై.. ఇద్దరు యువకులు?

 


ఒంటరి మహిళపై అత్యాచారం

మద్యం మత్తులో మహిళపై యువకులు లైంగిక దాడి 



బెజవాడ : (ఫస్ట్ న్యూస్ 4 యు) రాజమండ్రి గౌరీ పట్టణానికి చెందిన ఓ వివాహితకు 20 ఏళ్ల క్రిందట వివాహం అయింది. ఆమెకు 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవల భర్తతో గొడవపడి ఒంటరిగా విజయవాడకు వచ్చి.. వాంబే కాలనీలో నివాసం ఉంటుంది. అక్కడే ఉన్న హిజ్రాలతో కలిసి రోజు భిక్షాటనం చేసుకొని జీవనం సాగిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఓ హిజ్రా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చింది. కొంతసేపటికి ఎవరు ఇంటి తలుపులు దబ దబాదుతూ ఉండడంతో ఎవరు? ఎవరు? అంటూ తలుపు తీసింది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం భిక్షాటనానికి రాకపోవడంతో హిజ్రాలు ఆమె ఇంటికి వెళ్లి చూడగా అపస్వారక స్థితిలో పడి ఉంది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ముమ్మరం చేసి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులతో పాటు సహకరించిన మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఆడపిల్లలు ...జాగ్రత్త ...!

 మొబైల్ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఇంస్టాగ్రామ్ లో మరింత దగ్గరే ఆ యువతీని బ్లాక్మెయిల్ చేశాడు. కుటుంబం మొత్తం మనస్థాపం చెంది

బల్మరణానికి పాల్పడింది..24 గంటల్లో ఏం జరిగిందంటే....?




నూజివీడుకు చెందిన ఓ యువతి లూడో కం ఫన్ గేమ్ మొబైల్లో ఆడుతూ ఉండగా మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన రోహన్ వైకుంఠం వేముల అనే వ్యక్తి పరిచయం అయ్యాడు... అనంతరం ఇంస్టాగ్రామ్ ద్వారా మరింత చేరువయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారడంతో ఆ యువతిని మాయమాటల్లో పెట్టి, ఆమె ద్వారా న్యూడ్ వీడియోలను షేర్ చేసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక డబ్బు కోసం ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు పంపిస్తానని సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. చివరకు ఆ యువతి తండ్రి పుట్టినరోజు అయిన ఈ నెల 26వ తేదీన ఆయన మొబైల్కు కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్కు ఆ వీడియోలను షేర్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు మొత్తం మనస్థాపానికి గురై బల్మరణానికి  పాల్పడడానికి సిద్ధమైనారు. చివరిగా ఈ విషయాన్ని ఆ యువతి తన స్నేహితురాలితో పంచుకుంది. ఆ స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా నూజివీడు పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు. వారి ద్వారా ఫిర్యాదును స్వీకరించి 24 గంటల్లో ఆ వ్యక్తిని అరెస్టు చేసి ఈనెల 27వ తేదీన కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విధించారు.


  నెటిజన్లు అభిప్రాయం :


 ఇటీవలే రాజమండ్రిలో నూకరాజు కుటుంబం ఈ విధంగానే మృత్యువాత పడింది. ఈ ఘటన మరవకముందే నూజివీడులో ఇలా జరగడం పట్ల కొంతమంది నెటిజన్లు  దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సోషల్ మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలని, ఎప్పటికప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తూ మంచి మార్గంలో పెంచాలని అభిప్రాయాన్ని వెల్లడించారు.

కాళికాదేవి విగ్రహం లభ్యం

చంద్రగిరి లో  కాళికాదేవి విగ్రహం లభ్యం 


చంద్రగిరి బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పురాతన కాళికాదేవి విగ్రహం లభ్యమవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.



పంచలోహాలతో తయారైనట్లు కనిపిస్తున్న ఉగ్రరూపంలోని కాళికాదేవి విగ్రహం కోనేరులో బయటపడినట్లు చంద్రగిరి టీడీపీ సీనియర్‌ నాయకులు గౌస్‌ బాషా, రమేష్‌ రెడ్డి తెలిపారు.

బ్రహ్మంగారి ఆలయ సమీపంలోని కోనేరు మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, గురువారం ఉదయం పనులు చేస్తున్న సిబ్బంది కోనేరులో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలను తొలగిస్తుండగా విగ్రహం బయటపడినట్లు పేర్కొన్నారు.

విగ్రహం లభ్యమైన విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు.

విగ్రహం పురాతనమైనదా? పంచలోహాలతోనే తయారైందా? దాని చారిత్రక ప్రాధాన్యత ఏమిటనే విషయాలను సంబంధిత పురావస్తు, దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించాల్సి ఉంది.

కోనేరు వద్ద విగ్రహం బయటపడిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆసక్తిగా పరిశీలించారు.

ఇంతటి ఉగ్రరూపంలో ఉన్న పురాతన విగ్రహాన్ని ఇంతకుముందు తాము ప్రత్యక్షంగా చూడలేదని పలువురు స్థానికులు తెలిపారు.విగ్రహం లభ్యమైన నేపథ్యంలో అధికారులు వెంటనే ప్రదేశాన్ని పరిశీలించి, విగ్రహం చారిత్రక నేపథ్యం, నిర్మాణ కాలం తదితర వివరాలను అధికారికంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

వివాహ వేడుకల్లో బిజీ బిజీగా ఆర్కే రోజా

 

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా 


నగరి మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపి మహిళా నేత రోజా శనివారం పలు వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా సత్ర వాడ MS కళ్యాణ మండపంలో నిండ్ర మండలం మాదిరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యదర్శి గోవిందరాజులు అక్క కుమార్తె ప్రియా, విగ్నేష్ వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. నగిరి అశ్విని కళ్యాణ మండపంలో విజయపురం మండలం కాళికాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ రమేష్ పాండియన్ అక్క మీనా రవి రెడ్డి దంపతుల కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. పుత్తూరు ఏసీజె కళ్యాణమండపం లో విజిలెన్స్ కానిస్టేబుల్ జయరాం రెడ్డి కుమారుడు అజయ్ రెడ్డి శ్రేయ వివాహ మహోత్సవంలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. పుత్తూరు ఈశ్వరి ఫంక్షన్ హాల్లో నిండ్ర మండలం మాజీ సర్పంచ్ రవి రెడ్డి కుమార్తె శోభ దినేష్ ల వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. తిరుపతి బాలాజీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ గాంధీ బామర్ది ఆనంద్ గీతిక వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.