వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి
-పూతలపట్టు సీఐ తిమ్మయ్య
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
![]() |
పూతలపట్టు సీఐ తిమ్మయ్య |
సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా పూతలపట్టు మండల కేంద్ర పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని పూతలపట్టు సీఐ తిమ్మయ్య తెలిపారు. వినాయక విగ్రహాల ఏర్పాట్లు పోలీసుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనుమతి పొందడం కోసం వినాయక ఉత్సవ్ అప్ లో ఆన్లైన్ ద్వారా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను పూరించాలి అన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు నుండి నిమజ్జనం వరకు పూర్తి బాధ్యత మండప నిర్వహకులదే అన్నారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన తర్వాత మద్యం సేవించడం గాని, DJ ఏర్పాటు చేయడం గానీ, అశ్లీల నృత్యాల ఏర్పాటు చేయరాదన్నారు . ఊరేగింపులో బాణ సంచాలు పేల్చరాదన్నారు. తద్వారా ఏదైనా ప్రమాదాలు జరగవచ్చునని, ఒకవేళ అనుమతి లేకుండా చేపట్టే చర్యల వల్ల అలా ప్రమాదాలు జరిగితే పూర్తి బాధ్యత మండప నిర్వహకులదే అన్నారు. వినాయక చవితి వేడుకల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పూతలపట్టు పోలీసులకు గాని లేదా 112 కు సమాచారం ఇవ్వాలన్నారు

No comments:
Post a Comment