5వ డివిషన్లో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి 50వ జన్మదిన వేడుకలను చిత్తూరు నగరం 5వ డివిజన్ పరిధిలోని ఎస్టేట్‌లో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు, మాజీ కార్పొరేటర్ హరణి రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విజయానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మిథున్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరణి రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి సంక్షేమం కోసం మిథున్‌రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, సేవా దృక్పథం అభినందనీయమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. మిథున్‌రెడ్డి మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్, భాగ్యలక్ష్మి, హరీష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ సభ్యులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment