Tuesday, 29 September 2026

హాస్టల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మధ్య వారిధిగా "శివ్నెక్స్ యాప్

హాస్టల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మధ్య వారిధిగా "శివ్నెక్స్ యాప్"



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 


కుటుంబ సభ్యులకు దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మధ్య వారిధిగా శివ్నెక్స్ యాప్ పనిచేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. హాస్టల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడించడం, తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచడం కోసం SKANDEV, డా.Sahi, Oorulogix సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ యాప్ ను సోమవారం రాత్రి సంజయ్ గాంధీ నగర్ లోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా శివ్నెక్స్ యాప్ ద్వారా విద్యార్థులను వారి తల్లిదండ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. ఎమ్మెల్యే సైతం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, ఆధునిక సాంకేతికతను సురక్షితంగా అందుబాటులో తేవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ప్రముఖ సైకాలజిస్ట్  డా.సాహిత్య వసతి గృహ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment