ప్రజా సమస్యలపై దృష్టి సారించండి
- సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు :
జిల్లాలో ప్రజా సమస్యల రోజు రోజుకి పెరుగుతున్నాయని వాటిపై దృష్టి పెట్టాలని కూటమీ ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతున్నది తప్ప జిల్లాలో గతంలో చెప్పిన సమస్యలను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నదని వాటిపై దృష్టి పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు
ఆదివారం సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకు ప్రజా సమస్యలు పెరుగుతున్నాయి అన్నారు ప్రకృతిని ధ్వంసం చేస్తూ మట్టి మాఫియా రెచ్చిపోతున్నదని పూతలపట్టు, జీడి నెల్లూరు, నగరి, పలమనేరు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా మట్టి మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరిస్తూ కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. ఉపాధి హామి పధకం ద్వారా జరుగుతున్న పనుల్లో అనేక రకాల అవకతవకలు జరుగుతున్న జిల్లా అధికారులు సరైన పర్యవేక్షణ ఉండడం లేదని తెలిపారు. గతంలో జిల్లాలో 2500 వరకు గోకులం షెడ్లు నిర్మించారని వీటిలో అనేక రకాల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. అధికార కూటమి నాయకులు ప్రభుత్వ భూములను పేదల భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్న ఏమాత్రం చలనం లేదన్నారు. జిల్లాలో దళితులు దళితవాడలో నివసిస్తున్న ప్రాంతాల్లో అత్యధిక గ్రామాల్లో స్మశానాలు లేవన్నారు. ఉన్నచోట ఆక్రమణ గురయ్యాయి వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక గ్రామాల్లో త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని జిల్లా అధికారులు సమస్య లేకుండా దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నూతనంగా పింఛన్లకు ఇవ్వడానికి సిద్ధమవుతుండగా రకరకాల ఆంక్షలతో అర్హులైన వారు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. ఆంక్షలను తొలగించి నిజమైన అర్హులకు పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి సమయం పెంచి అక్టోబర్ నుంచి పింఛన్లు వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. గంగవరం మండలంలో అనేక రకాల భూకబ్జా జరుగుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని లేబర్ అధికారులు ఏమాత్రం పట్టి పట్టనట్లు ఉన్నారు. ఈ సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment