Friday, 11 September 2026

అర్హులైన అందరికీ పింఛన్లు అందాలి.. * ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

అర్హులైన అందరికీ పింఛన్లు అందాలి..

* ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ 





చిత్తూరు : చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందాలని, ఇందుకోసం స్థానిక నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులో తెలుగుదేశం పార్టీ యూనిట్, క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు, ప్రధాన, అనుబంధ కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మంజూరు చేయడానికి చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. స్థానిక నాయకులు స్థానికంగా అర్హులైన ప్రతి లబ్ధిదారున్ని‌ గుర్తించి స్వర్ణ గ్రామ/ వార్డు సచివాలయానికి తీసుకెళ్లి దరఖాస్తు చేయించాలన్నారు. అధికారులకు సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా సహకారం అందించాలన్నారు.

* చిత్తూరు ప్రజల క్షేమాన్ని కోరుతూ.. శనివారం సాయంత్రం నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణం, యజ్ఞయాగాది కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజల సంతోషంగా ఉండాలని కోరుతూ శ్రీనివాస కళ్యాణం ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment