Wednesday, 16 September 2026

యూపీఐ లావాదేవీలపై చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి

 *యూపీఐ లావాదేవీలపై చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి* 

*సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్* 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీల పై చార్జీలు విధించడాని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఐ చార్జీలు విధించడం ద్వారా ఇప్పటికే ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న పేద ,మధ్యతరగతి పై అదనపు భారాలు వేయడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తున్నది. వినియోగదారులపై సంవత్సరానికి 20వేల కోట్లు అదనప భారం పడుతుంది. ఇందులో అత్యధిక భాగం అమెరికా కంపెనీలకు పోతుంది. 


అమెరికా ఫైనాన్స్ కంపెనీల ఒత్తిడికి కేంద్రం తలొగ్గి నగదు లావాదేవీలను తగ్గించాలని ప్రచారం చేసి ప్రజలచే యూపిఐ వాడకాన్ని అలవాటు చేసింది. తీర ప్రజలందరూ చెల్లింపులకు అలవాటు పడిన తర్వాత చార్జీలు విధించడం ప్రజలను దగా చేయడమే. 


వినియోగదారులపై చార్జీ లేకుండా వ్యాపారస్తులకి చార్జీ పడుతుందని ప్రభుత్వ వాదన పసలేనిది. అంతిమంగా వినియోగదారునికి భారం పడుతున్నదని వాస్తవం. 2000 రూపాయలు పైబడిన చెల్లింపులకు వర్తిస్తుంది 95 శాతం మందికి భారం పడదు అనేది వాస్తవం కాదు. ద్రవ్యవేల్బణం పెరిగిన నేపథ్యంలో 95 శాతం మంది ప్రజలపై భారం పడుతుంది. కేవలం కిల్లి సిగరెట్టు బడ్డీ కొట్టుల తప్ప మిగిలిన వ్యాపారస్తులందరూ చార్జీలు చెల్లించాలి. ఆ భారాన్ని వారు వినియోగదారులపైనే మోపుతారు అన్నది అనుభవం. 


కాబట్టి పేద మధ్యతరగతి పై నడ్డి విరగొట్టే యుపిఐ చార్జీలు ఉపసర్పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి చార్జీలు విధించకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం జనసేన పార్టీలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నది రాష్ట్రంలో ప్రజలందరూ ఈ చార్జీలను వ్యతిరేకించాలని సిపిఎం పిలుపునిస్తున్నది

No comments:

Post a Comment