గాయత్రీ మంత్రం అనుష్టానం చేయడంతో సంకల్పసిద్ధి
- హరిద్వార్ గురు రాజారావు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
గాయత్రీ మంత్రం అనుష్టానం చేయడం వలన సంకల్పసిద్ధి కలుగుతుందని గాయత్రి పరివార్ హరిద్వార్ శాంతి కుంజ్ కు చెందిన గురు రాజారావు అన్నారు. గురువారం సాయంత్రం సిద్ధ సమాధి యోగ యోగాచార్యుడు నరేంద్ర కుమార్ సౌజన్యంతో చిత్తూరు నగరంలోని విజయం ఇంటర్మీడియట్ కళాశాలలో సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిరోజు గాయత్రి మంత్రం జపించడం వలన సంకల్పం సిద్ధిస్తుందని కామధేనువు కల్పవృక్షం లాంటిది గాయత్రి మంత్రమని ఆయన తెలిపారు. గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి సర్వ మానవాళికి అందించారన్నారు. కులాలకు లింగ భేదాలకు అతీతంగా గాయత్రి మంత్రం ప్రతిరోజు అనుష్టానం చేయడం వలన కోరికలు నెరవేరడమే కాకుండా విశ్వక్సేమం, ప్రకృతి సుభిక్షo శాంతి నెలకొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధ సమాధి యోగ ధ్యానులు వాలంటరీలు పాల్గొన్నారు
No comments:
Post a Comment