Friday, 11 September 2026

కట్టమంచి చెరువులో జలశుద్ధి జలహారతి

 కట్టమంచి చెరువుకు జలశుద్ధి, జల హారతి 

వినాయక నిమజ్జనానికి నాంది 

14 నుండి నిమజ్జనానికి ఏర్పాట్లు 

- వినాయక నగర ఉత్సవ కమిటీ సభ్యులు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో చిత్తూరు  వినాయక ఉత్సవ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జలశుద్ధి జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రక్తంగా జలశుద్ధి పూజ నిర్వహించి కట్టమంచి చెరువుకు జలహారతిని అందించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు రామభద్ర మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకొని సాయంత్రం 4.30 లకు నిమజ్జన కార్యక్రమాన్ని చిత్తూర్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభిస్తారు అన్నారు. మూడు రోజులపాటు నిమజ్జన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి సంబంధించి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా క్రేన్లు ఇతర ఏర్పాట్లను చేస్తారన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మూడు రోజులపాటు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వినాయక చవితి వేడుకలను మట్టి విగ్రహాలతో జరుపుకోవాలని, భారీ ఎత్తున మట్టి విగ్రహాలు అందుబాటులోకి వచ్చిన కారణంగా మండపం నిర్వాహకులు వీళ్ళని ఇంతవరకు మట్టి విగ్రహాలని పూజించి నిమజ్జనం చేయాలని కోరారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిట్టిబాబు అట్లూరి శ్రీనివాసులు , సత్య, గొల్ల హరిచంద్ర ప్రసాద్, తోటపాళ్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment