Monday, 28 September 2026

అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు – ముగ్గురు ముద్దాయిల అరెస్టు

*అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు – ముగ్గురు ముద్దాయిల అరెస్టు*

*సుమారు రూ.3.50 లక్షలు విలువ గల నాలుగు దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలు స్వాధీనం.*

*చెడు అలవాట్ల కారణంగా దొంగాతనలాకు పాల్పడుతున్న ముఠా.*


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు ముద్దాయిలను బంగారుపాళ్యం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల మొత్తం విలువ సుమారు రూ.3,50,000/-.


బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ Cr.No.160/2026 U/sec.303(2) BNS కేసులో, బంగారుపాళ్యం మండలం కటప్పగారిపల్లి సమీపంలోని శ్రీ వారి హోటల్ వద్ద పార్క్ చేసిన Suzuki Access (AP-03-CX-0050) ద్విచక్ర వాహనం దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


దర్యాప్తులో భాగంగా, జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు 28-09-2026 తేదీన బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కత్తి శ్రీనివాసులు, ఎస్‌.ఐ. టి. ప్రసాద్ మరియు సిబ్బంది చిత్తూరు–పలమనేరు NH-69 హైవే రోడ్డుపై వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.


ఈ క్రమంలో పోలీసులను గమనించి వెనక్కి తిరిగి పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన విగ్నేష్ కుమార్ సెల్వం @ విగ్నేష్, బి.చంద్రు బీమన్, జి.విజయ్ గా గుర్తించారు.


విచారణలో ఆర్థిక అవసరాలు మరియు చెడు అలవాట్ల కారణంగా తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.


వారి వాంగ్మూలం మరియు వారు చూపించిన ప్రదేశం ఆధారంగా కటప్పగారిపల్లి క్రాస్ సమీపంలోని మూసివేయబడిన మహా జ్యూస్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోని షెడ్‌లో దాచిపెట్టిన నాలుగు దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలను బంగారుపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


*అరెస్టు చేసిన ముద్దాయిల వివరాలు:*


1. విగ్నేష్ కుమార్ సెల్వం @ విగ్నేష్, వయస్సు 20 సంవత్సరాలు, తండ్రి: సెల్వం, నివాసం: నెం.197, ఓల్డ్ కాలనీ, వడపుదుపట్టు గ్రామం, అంబూర్ తాలూకా, వేలూరు జిల్లా, తమిళనాడు.


2. బి. చంద్రు భీమన్, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి: భీమన్, నివాసం: మెయిన్ రోడ్, పుదూర్, మెల్వాయితినంకుప్పం (ఎం.వి. కుప్పం), మెల్పట్టి పోస్ట్, పెర్నాంబట్టు తాలూకా, వేలూరు జిల్లా, తమిళనాడు.


3. జి. విజయ్, వయస్సు 26 సంవత్సరాలు, తండ్రి: జ్ఞానప్రకాశం, డోర్ నెం.1/157, కనారు స్ట్రీట్, సమరీశికుప్పం గ్రామం (ఎస్.ఆర్. కుప్పం), ఎం.వి. కుప్పం పోస్ట్, పెర్నాంబట్టు తాలూకా, వేలూరు జిల్లా, తమిళనాడు.


*రికవరీ చేసిన దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలు:*


1. Suzuki Access – AP-03-CX-0050, విలువ సుమారు రూ.80,000/- బంగారుపాళ్యం PS Cr.No.160/2026.


2. TVS Jupiter – TN-23-DJ-4505, విలువ సుమారు రూ.1,30,000/- బంగారుపాళ్యం PS Cr.No.158/2026


3. Suzuki Access – AP-40-CE-2237 విలువ సుమారు రూ.50,000/- చిత్తూరు తాలూకా PS Cr.No.44/2026


4. Suzuki Access – AP-40-EE-0028, విలువ సుమారు రూ.90,000/- చిత్తూరు II టౌన్ PS Cr.No.106/2026


*రికవరీ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాల మొత్తం విలువ సుమారు రూ.3,50,000/-.*


అదేవిధంగా, నేరాలకు ఉపయోగించిన Bajaj Pulsar NS200, Reg.No.TN-18-BA-8212 ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.


అరెస్టు చేసిన ముగ్గురు ముద్దాయిలను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ద్వారా మరిన్ని ద్విచక్ర వాహనాల దొంగతనాలు జరిగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని బంగారుపాళ్యం U/G పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కత్తి శ్రీనివాసులు గారు తెలిపారు.

No comments:

Post a Comment