Saturday, 26 September 2026

రైల్వే లెవెల్ క్రాసింగ్‌ వద్ద మరమ్మతులు – 29 నుంచి అక్టోబర్‌ 1 వరకు ట్రాఫిక్‌ మళ్లింపు :

రైల్వే లెవెల్ క్రాసింగ్‌ వద్ద మరమ్మతులు – 29 నుంచి అక్టోబర్‌ 1 వరకు ట్రాఫిక్‌ మళ్లింపు : 

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. 





చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు, సెప్టెంబర్‌ 26: 

చిత్తూరు–సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్‌ 31/23–25 వద్ద (మొసానికల్‌ గ్రౌండ్‌ సమీపంలో) ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ నెం.27 వద్ద రైల్వే శాఖ ఆధ్వర్యంలో సమగ్ర మరమ్మతు (ఓవర్‌హాలింగ్‌) పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేటు ట్రాక్‌ భాగంలో మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో 29.09.2026 నుంచి 01.10.2026 వరకు సంబంధిత మార్గంలో రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు సహకరించాలని, రైల్వే శాఖ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి ప్రయాణించాలని కోరారు. పై ప్రకటనలో తెలిపారు








No comments:

Post a Comment