Thursday, 10 September 2026

ఫ్లాష్ న్యూస్: కుప్పకూలిన నిర్మాణ దశలో ఉన్న చర్చ్

 ఫ్లాష్ ఫ్లాష్ : కుప్పకూలిన నిర్మాణ దశలో ఉన్న చర్చ్ 

మండి కృష్ణపురంలో ఘటన 

తిరువళం పోలీసులు దర్యాప్తు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 





గుడిపాల మండలంలో నిర్మాణ దశలో ఉన్న చర్చ్ కూలిపోయి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పదిమందికి తీవ్ర గాయాలయింది. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుమల గ్రామానికి చెందిన పోలీసుల సమాచారం మేరకు గుడిపాల మండలం మండి కృష్ణాపురం గ్రామం వద్ద తమిళనాడు తిరుగలం గ్రామానికి చెందిన భూమిలో సిఎస్ఐ చర్చును నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నూతనంగా నిర్మిస్తున్న చర్చ్కు మోల్డింగ్ పనులు ప్రారంభించారు. సాయంత్రం ఉన్నపలంగా మౌల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో పనిచేస్తున్న ఒక కూలి మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. తమిళనాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.




No comments:

Post a Comment