*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రానికి అవసరం*...
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు*
*చంద్రబాబు అక్రమ అరెస్టైన రోజును బ్లాక్ డే గా పాటించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు*.
----------------------------
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
ఇప్పుడున్న పరిస్థితితుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరమని ఉద్ఘాటించారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..
నవ్యంధ్రప్రదేశ్ సాధన కోసం అహర్నిశలు శ్రమించడం చంద్రబాబు పాలనాదక్షతకు నిదర్శనమని కొనియాడారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు [2026 సెప్టెంబర్ 9] నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ (TDP) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.., ఆ రోజుకు నిరసనగా బుధవారం బ్లాక్ డే పాటించారు...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయగా, ఆయన 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారని గుర్తుచేసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..., "రాజకీయ కక్ష సాధింపుల కోసమే నాడు చంద్రబాబును అక్రమ కేసులో నిర్బంధించారని వైకాపా తీరును తప్పుపట్టారు . నాడు తెలుగుజాతి మొత్తం 'నిజం గెలవాలి' అంటూ మద్దతుగా నిలిచిందనీ, ఇప్పుడు న్యాయస్థానాల్లో నిజం కూడా గెలిచిందనీ, అక్రమ కేసులన్నీ కొట్టుకుపోయాయని ఆయన తెలియజేశారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడుకు మనమందరం అండగా నిలవాలని, ఆయన నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కూటమి నాయకులకు కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు..

No comments:
Post a Comment