బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయితే ఆందోళన చెందవద్దు – ముందుగా కారణాన్ని తెలుసుకుని చట్టబద్ధమైన విధానంలో చర్యలు తీసుకోండి.
*ఖాతాపై విధించిన ఫ్రీజ్ లేదా లియన్ వివరాలను బ్యాంకు నుంచి తెలుసుకుని, అవసరమైన ఆధారాలను సంబంధిత అధికారులకు సమర్పించండి.*
*సైబర్ నేరాలకు సంబంధించిన లావాదేవీలతో ఖాతాకు సంబంధం ఉన్నట్లయితే దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి
– జిల్లా ఎస్పీ తుషార్ డూడి
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
*చిత్తూరు జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయిన సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమైన సూచనలు చేశారు.*
*కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఖాతాలపై *డెబిట్ ఫ్రీజ్, లియన్, హోల్డ్ లేదా ఇతర ఆంక్షలు* విధించబడే అవకాశం ఉందని తెలిపారు. ఇవి సైబర్ నేరాల దర్యాప్తు, చట్టపరమైన ఆదేశాలు, బ్యాంకింగ్/నియంత్రణ సంబంధిత కారణాలు లేదా ఇతర కారణాల వల్ల ఉండవచ్చని, అందువల్ల ఖాతా ఫ్రీజ్ అయిన వెంటనే ఆందోళన చెందకుండా ముందుగా ఖాతాపై ఆంక్ష విధించడానికి గల కారణాన్ని తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.*
సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా అనుమానాస్పద లేదా వివాదాస్పద లావాదేవీలతో సంబంధం ఉన్న బ్యాంక్ ఖాతాలను పరిశీలించే అవకాశం ఉంటుందని ఎస్పీ గారు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తి స్వయంగా సైబర్ నేరానికి పాల్పడకపోయినా, సైబర్ నేరానికి సంబంధించిన నగదు లావాదేవీ తమ ఖాతా ద్వారా జరిగిన కారణంగా ఖాతా కూడా దర్యాప్తులోకి రావచ్చని పేర్కొన్నారు.
*బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయితే ఏం చేయాలి?*
*1. ముందుగా సంబంధిత బ్యాంకును సంప్రదించాలి*
ఖాతా ఎందుకు ఫ్రీజ్ అయిందో, ఖాతాపై *Debit Freeze / Lien / Hold* వంటి ఏ రకమైన ఆంక్ష విధించబడిందో బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోవాలి.
అలాగే, అందుబాటులో ఉంటే *ఫిర్యాదు లేదా రిఫరెన్స్ నంబర్, సంబంధిత పోలీసు విభాగం, దర్యాప్తు అధికారి లేదా ఇతర సంబంధిత అధికారుల వివరాలను* బ్యాంకు నుంచి తెలుసుకోవాలి.
*2. ఖాతా మరియు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలి*
ఖాతా స్టేట్‌మెంట్, UPI/NEFT/IMPS లావాదేవీల వివరాలు, Transaction IDలు, చెల్లింపు రసీదులు, ఇన్వాయిస్‌లు, కొనుగోలు/అమ్మకాల వివరాలు, సంబంధిత వ్యక్తులతో జరిగిన కమ్యూనికేషన్ మరియు ఇతర అవసరమైన పత్రాలను భద్రపరచుకోవాలి.
సైబర్ నేరానికి సంబంధించిన ఫిర్యాదుల్లో బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ రసీదులు మరియు ఇతర సంబంధిత ఆధారాలు ముఖ్యమైనవిగా ఉంటాయి.
*3. సైబర్ నేర దర్యాప్తు కారణంగా ఖాతా ఫ్రీజ్ అయితే సంబంధిత దర్యాప్తు అధికారిని సంప్రదించాలి*
బ్యాంకు ద్వారా అందిన వివరాల ప్రకారం ఖాతా సైబర్ నేరానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఫ్రీజ్ చేయబడినట్లయితే, సంబంధిత దర్యాప్తు అధికారిని సంప్రదించి తమ ఖాతా మరియు లావాదేవీలకు సంబంధించిన వాస్తవాలను వివరించాలి.
తాము చట్టబద్ధంగా నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, Transaction IDs, UPI వివరాలు, రసీదులు, ఇన్వాయిస్‌లు మరియు ఇతర సంబంధిత ఆధారాలను దర్యాప్తు అధికారికి సమర్పించాలి.
*4. బ్యాంక్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తు సమర్పించాలి*
ఖాతా ఫ్రీజ్‌కు సంబంధించిన సమస్యపై ఖాతాదారుడు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తు (Grievance/Representation) సమర్పించాలి. దరఖాస్తులో ఖాతా వివరాలు, ఖాతాపై విధించిన ఫ్రీజ్/లియన్ వివరాలు, సంబంధిత రిఫరెన్స్ నంబర్, లావాదేవీల వివరాలు మరియు తమ వద్ద ఉన్న సంబంధిత ఆధారాలను జత చేయాలి. ఖాతాదారుడు సమర్పించిన దరఖాస్తు ఆధారంగా సంబంధిత బ్యాంక్ మేనేజర్ GRM (Grievance Redressal Mechanism) పోర్టల్‌లో ఫిర్యాదును నమోదు చేస్తారు.
GRMలో ఫిర్యాదు నమోదు చేసిన అనంతరం Acknowledgement / Reference Number తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలి. తదుపరి అవసరమైన సమాచారాన్ని లేదా పత్రాలను సంబంధిత బ్యాంకు/అధికారులు కోరినప్పుడు సమర్పించాలి.
*5. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి*
తమ ఖాతాలోకి డబ్బు ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఏ కారణంతో లావాదేవీ జరిగింది వంటి వివరాలను సంబంధిత ఆధారాలతో స్పష్టంగా తెలియజేయాలి.
సంబంధిత అధికారులు అందించిన సమాచారం మరియు ఆధారాలను పరిశీలించి, దర్యాప్తు మరియు చట్టపరమైన ప్రక్రియకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.
*ఖాతా ఫ్రీజ్ అయిన వెంటనే స్వయంచాలకంగా అన్‌ఫ్రీజ్ అవుతుందని భావించకూడదు.* ఖాతాపై విధించిన ఆంక్షకు కారణమైన సంబంధిత బ్యాంకు/చట్టపరమైన/దర్యాప్తు ప్రక్రియ ప్రకారం తదుపరి చర్యలు కొనసాగుతాయి.
🚨 *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* 🚨
🚨 *బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయిందని చెప్పి “డబ్బులు చెల్లిస్తే వెంటనే ఖాతాను అన్‌ఫ్రీజ్ చేస్తాం” అని చెప్పే వ్యక్తులను నమ్మకూడదు.*
🚨* పోలీసుల పేరుతో, బ్యాంకు అధికారుల పేరుతో లేదా సైబర్ క్రైమ్ అధికారుల పేరుతో ఎవరైనా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపాలని కోరితే అప్రమత్తంగా ఉండాలి.*
❌ *తమ బ్యాంక్ ఖాతాను ఇతరులు ఉపయోగించడానికి ఇవ్వకూడదు.*
❌ *తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేయకూడదు.*
❌ *కమిషన్ కోసం తమ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడానికి అనుమతించకూడదు.*
❌ *OTP, UPI PIN, ATM PIN, CVV, Net Banking Password వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు.*
*అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకును లేదా సైబర్ పోలీసులను సంప్రదించాలి.*
ఆన్‌లైన్ ఆర్థిక మోసానికి గురైన వ్యక్తులు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి. అలాగే National Cyber Crime Reporting Portal – cybercrime.gov.in** ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి.
మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా సంబంధిత లావాదేవీలపై సకాలంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు ఉపయోగించడానికి ఇవ్వకుండా, ప్రతి ఆన్‌లైన్ లావాదేవీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లావాదేవీల విషయంలో వెంటనే సంబంధిత బ్యాంకు మరియు పోలీసు అధికారులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు సూచించారు.

No comments:
Post a Comment