Thursday, 17 September 2026

స్వచ్ఛత హి సేవా - 2026' విజయవంతం చేయండి

*'స్వచ్ఛత హి సేవా - 2026' విజయవంతం చేయండి* 

*జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్* 



చిత్తూరు, సెప్టెంబరు 17 ఫస్ట్ న్యూస్ 4 యు 

జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛత హి సేవా - 2026’ కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు 

 *స్వచ్ఛత కార్యక్రమాల షెడ్యూల్ :* 

సెప్టెంబరు 17 - 18 (స్వచ్ఛ పాఠశాల – యువ ఫర్ స్వచ్ఛత): వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన, స్వచ్ఛత జ్ఞాన యాత్రలు, వర్షపు నీటి సంరక్షణపై చర్చలు.

సెప్టెంబరు 19 - 20 (టార్గెట్ యూనిట్ల సుందరీకరణ): అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రపరచడం, సెల్ఫీలు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచారం.

సెప్టెంబరు 21 - 22 (క్లీన్ పబ్లిక్ ప్లేసెస్): బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, నీటి వనరులు మరియు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధక చర్యలు.

సెప్టెంబరు 23 - 24 (జన్ భాగీదారి అడ్వొకేసీ డ్రైవ్స్): డోర్-టు-డోర్ ప్రచారం, 4-వే సెగ్రిగేషన్, హోమ్ కంపోస్టింగ్, గుడ్డ సంచుల వాడకంపై అవగాహన.

సెప్టెంబరు 25 - 26 (స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత): వినాయక నిమజ్జనం తర్వాత ఘాట్ల పరిశుభ్రత, క్రీడా మైదానాల్లో జీరో-వేస్ట్ పోటీలు మరియు స్వచ్ఛతా డ్రైవ్‌లు.

సెప్టెంబరు 27 (ప్రపంచ పర్యాటక దినోత్సవం): చారిత్రక, పర్యాటక ప్రదేశాల శుభ్రత మరియు పబ్లిక్ టాయిలెట్ల వద్ద దీపాలంకరణ.

సెప్టెంబరు 28 - 29 (వ్యర్థాల నుండి సంపద - RRR): వ్యర్థాలతో కళాఖండాలు ('కబాడ్ సే కలా'), రీసైక్లింగ్ మేళాలు, ఉత్తమ సృష్టికర్తల సత్కారం.

సెప్టెంబరు 30 (సఫాయి మిత్ర సురక్షా): పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల అందజేత, సన్మానం.

అక్టోబర్ 1 (శ్రమదానం): ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారుల సమిష్టి శ్రమదానం.

అక్టోబర్ 2 (స్వచ్ఛ భారత్ దివస్): ప్రత్యేక గ్రామసభలు, పట్టణ కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముందుగానే స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా మరుగుదొడ్లను సురక్షితమైన, శుభ్రమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి.అధికారులు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు



.

No comments:

Post a Comment