*విఓఏల కు వేతనాలు పెంచాలి*
*వేధింపులు మానుకోవాలి*
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణమ్మ డిమాండ్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
రాష్ట్రవ్యాప్తంగా విఓఏ లకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసి జీతాలు పెంచాలని, అధికారులు వేధింపులు మానుకోవాలని పని ఒత్తిడి తగ్గించాలని బుధవారం చిత్తూరు సిఐటియు కార్యాలయం ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం(సిఐటియు)జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశం నాగరాజు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వివోఏ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణమ్మ, రాణి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారిచే లకు పనిభారం పెంచడం ఏమిటి అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో మహిళలను చైతన్యవంతులు చేసి సంఘాలుగా ఆర్గనైజ్ చేస్తున్న వివో ఏలపై వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో పిడి మహిళగా ఉన్నప్పటికీ మహిళలను అసభ్యకరంగా మాట్లాడడం దారుణం అన్నారు.
ప్రభుత్వం పథకాలలోని అన్ని రకాల పనులు చేయించుకుంటూ పని భారం పెంచడం దుర్మార్గమన్నారు. వివోఏ ల సమస్యలు పరిష్కరించాలని 7 తేదీన అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా పరిష్కారం చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని రకాల హామీలు ఇచ్చి హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని పని భారం తగ్గిస్తామని చెప్పినప్పటికీ రోజురోజుకీ కొత్త యాపులు తీసుకొచ్చి భారం పెంచడం దారుణమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దసల వారి పోరాటాలకు పిలుపునిచ్చినామని అప్పటికి పరిష్కారం కాకపోతే చలో విజయవాడ నిర్వహించి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల్లోనూ వివో ఎలా సత్తా చాటుతామని హెచ్చరించారు.
డిసెంబర్ లో చలో ఢిల్లీ
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడానికి నిరసిస్తూ సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కార్మికుల్ని తరలించి డిసెంబర్ 1 2 3 తేదీల్లో చలో ఢిల్లీ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుండి వివో ఏలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీధర్ బాబు జిల్లా నాయకులు భ్రమరాంబ వివోఏలు పాల్గొన్నారు

No comments:
Post a Comment