డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 6 మందికి భారీ జరిమానా
- ట్రాఫిక్ సిఐ నరసింహారాజు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు SDPO శ్రీ J. వెంకట నారాయణ గారి పర్యవేక్షణలో , చిత్తూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ P. నరసింహ రాజు మరియు ఎస్ఐలు మహేష్ & త్యాగరాజు వారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురు పట్టుబడ్డారు.
వీరిని 11.09.2026న చిత్తూరు 1st Spl. Judicial 2nd Class Magistrate కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.60,000 జరిమానా విధించారు.
అలాగే రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ వ్యాపారం నిర్వహించిన 123 మందిపై TN Act ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి మొత్తం రూ.66,150/- జరిమానా విధించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ P. నరసింహ రాజు గారు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు.

No comments:
Post a Comment