Tuesday, 22 September 2026

రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో అభివృద్ధి పనుల్ని కుప్పం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు

*రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో అభివృద్ధి పనుల్ని కుప్పం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు*



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:


రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో అభివృద్ధి పనుల్ని కుప్పం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు* ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...


• రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో ఇవాళ సువర్ణ అధ్యాయం.

• పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసేలా కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ శాఖ మంత్రికి, అధికారులకు అభినందనలు.

• రెండేళ్ల పాటు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోని వాటిని అభివృద్ధి దిశగా పాలన కొనసాగిస్తున్నాం.

• ఇవాళ పట్టణ ప్రాంతాల్లో రూ.11,359 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టాం.

• ప్రస్తుతం జరుగుతున్న పనులతో కలిపి రూ.50 వేల కోట్ల పనులకు ప్రతిపాదనలు చేశాం.

• రూ.50 వేల కోట్ల ప్రతిపాదనలకు సంబంధించిన పనులు జరిగితే రాష్ట్రం దశ-దిశ మారుతుంది.

• రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.22,330 వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయి.

• మరో ఆరు నెలల్లో రూ.17 వేల కోట్ల పనులు కూడా ప్రారంభిస్తాం.

• హైబ్రీడ్ యాన్యుటీ మోడల్లో రూ.7,496 వేల కోట్ల పనులు చేపడుతున్నాం.

• ఒక్క విశాఖ కార్పోరేషన్ పరిధిలో రూ.3,890 వేల కోట్ల పనులు చేపడుతున్నాం.

• రోడ్లు, పార్కులు, సెంట్రల్ మీడియన్లు, సీవరేజి పనుల్ని మున్సిపాలిటీల్లో చేపట్టాలని నిర్ణయించాం.

• రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసేందుకు కూడా కార్యక్రమం చేపట్టాం.

• 2027 నాటికి రాష్ట్రంలోని టిడ్కో గృహాలను పూర్తి చేస్తాం.

• విశాఖ నగరంలో 28,500 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం.

• అలాగే అభ్యంతరం లేని చోట్ల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాం.

• ఎకానమీలో పట్టణ ప్రాంతాలు గ్రోత్ ఇంజన్లుగా ఉంటాయి. 

• వీకెండ్ ఎకానమీ పెంపోదించే దిశగా చర్యలు తీసుకోవాలి.

• తమకొచ్చే ఆదాయంలో 61 శాతం మొత్తాన్ని వారాంతాల్లో ప్రజలు ఖర్చు చేస్తున్నారు.

• హౌసింగ్ కోసం, రవాణా కోసం పట్టణ ప్రాంతాల్లో ప్రజలు 71 శాతం ఖర్చు పెడుతున్నారు.

• అందుకే టిడ్కో గృహాలతో పాటు రవాణా కోసం స్త్రీశక్తి లాంటి కార్యక్రమం చేపట్టాం.

• పట్టణ ప్రాంతాలు లివబిలిటీ పరిస్థితులు ఉండాలి.

• ఆహ్లాదకరమైన వాతావరణం తోపాటు ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండాలి.

• జల్ జీవన్ మిషన్ కార్యక్రమం పూర్తి చేసి 24 గంటలూ సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందిస్తాం.

• పట్టణాల అభివృద్ధికి పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టాం.

• భవన నిర్మాణ అనుమతులు త్వరితగతిన ఇస్తున్నాం.

• గడచిన రెండేళ్లుగా స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాలను చేపడుతున్నాం.

• రహదారులను పరిశుభ్రంగా ఉంచేలా కార్యక్రమాలు చేపట్టాం

• 143 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రవ్యాప్తంగా క్లియర్ చేశాం.

• వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు రెండు పని చేస్తున్నాయి.

• మరో 4 ప్లాంట్లను కూడా త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తాం.

• రీసైక్లింగ్ విధానంలో ఘన వ్యర్ధాలను క్లియర్ చేస్తున్నాం.

• మున్సిపాల్టీల్లో మురుగునీరు ఉండకుండా పరిశుభ్రంగా ఉంచాలి.

• 2047 నాటికి ప్రతీ మున్సిపాల్టీని స్వర్ణ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలి.

• పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు శ్రద్ధ పెట్టాలి.

• గత పాలనలో 120 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రాష్ట్రంలో పేరుకు పోయింది.

• జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు వాడకుండా నిర్లక్ష్యం చేశారు. 

• గత పాలనలో కొన్ని కేంద్ర పథకాల నిధుల్ని దారి మళ్లించారు.

No comments:

Post a Comment