Friday, 18 September 2026

గర్భిణీపై దాడి చేసి గాయపరిచిన భర్తకు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు రూ.500/- జరిమానా

*గర్భిణీపై దాడి చేసి గాయపరిచిన భర్తకు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు రూ.500/- జరిమానా.*

*చిత్తూరు I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో గర్భిణీపై దాడి చేసి గాయపరిచిన కేసులో నిందితుడైన భర్త A-1 S. బాబుకు 6 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500/- జరిమానా విధిస్తూ గౌరవ VI అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం జడ్జ్ శ్రీమతి టి.హరిత గారు తీర్పు వెలువరించారు.*


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:


*కేసు వివరాలు:*


ఈ కేసులో చిత్తూరు నగరం వెంకట్రావు కాలనీకి చెందిన A. దేవి ఫిర్యాదుదారుగా మరియు గాయపడిన వ్యక్తిగా ఉన్నారు. ఆమె భర్త A-1 S. బాబు (40 సంవత్సరాలు), అత్త A-2 E. సావిత్రి (54 సంవత్సరాలు) నిందితులుగా ఉన్నారు.


ఫిర్యాదు ప్రకారం, A. దేవి తన భర్త మరియు అత్త నుంచి కుటుంబపరమైన వేధింపులకు గురవుతూ కొంతకాలంగా తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె అప్పటికి గర్భిణీగా ఉన్నారు. 08-04-2019 రాత్రి సుమారు 9.00 గంటలకు A-1, A-2లు దేవి నివాసానికి వెళ్లి గొడవపడి, ఆమెను చేతులతో కొట్టి, కాళ్లతో పొట్టపై తన్నినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికులు జోక్యం చేసుకుని ఆమెను నిందితుల నుంచి రక్షించారు.


అనంతరం 09-04-2019 ఉదయం సుమారు 9.00 గంటలకు దేవి విధులకు వెళ్తున్న సమయంలో చిత్తూరు CMT రోడ్డులో, షర్మన్ మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్ వెనుక భాగంలో నిందితులు మరోసారి ఆమెపై దాడి చేసినట్లు కేసు నమోదైంది.


ఈ దాడి అనంతరం దేవికి తీవ్ర కడుపునొప్పి, గర్భాశయం నుంచి రక్తస్రావం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెకు గర్భస్రావం జరిగినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది.


ఫిర్యాదు అందిన వెంటనే అప్పటి చిత్తూరు I టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ శ్రీ G. పురుషోత్తం రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించి, గాయపడిన ఫిర్యాదుదారు మరియు ఇతర సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.


విశ్వసనీయ సమాచారం మేరకు 02-05-2019 మధ్యాహ్నం 2.00 గంటలకు A-1, A-2లను వారి నివాసం వద్ద అరెస్ట్ చేసి, గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి, సాక్షులను విచారించి, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను సేకరించి గౌరవ న్యాయస్థానంలో సమర్పించారు. కేసు విచారణ అనంతరం 18-09-2026న గౌరవ VI అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం, చిత్తూరు తీర్పును వెలువరించింది.


తీర్పు ప్రకారం A-1 S. బాబును U/Sec. 323 IPC కింద నేరస్థుడిగా నిర్ధారించి, Cr.P.C. 235(2) ప్రకారం దోషిగా నిర్ధారించారు. ఆయనకు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు రూ.500/- జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు వారాల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.


అదే సమయంలో A-1పై ఉన్న U/Sec. 313 IPC అభియోగం రుజువు కాకపోవడంతో ఆయనను ఆ అభియోగం నుంచి నిర్దోషిగా విడుదల చేశారు.


A-2 E. సావిత్రిపై ఉన్న U/Sec. 313, 323 r/w 34 IPC అభియోగాలు రుజువు కాకపోవడంతో ఆమెను Cr.P.C. 235(1) ప్రకారం నిర్దోషిగా విడుదల చేశారు.


కేసును నమోదు చేసి సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, సాక్ష్యాధారాలను సేకరించి చార్జ్‌షీట్ దాఖలు చేసిన అప్పటి చిత్తూరు 1 టౌన్ SI శ్రీ G. పురుషోత్తమ రెడ్డి గారితో పాటు, కేసు విచారణను నిరంతరం పర్యవేక్షించిన కోర్ట్ మానిటరింగ్ సెల్ సిబ్బంది శ్రీ ఖాదర్, కోర్టు కానిస్టేబుల్ శ్రీ నరసింహులు, కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీ మనోహర్ మరియు గౌరవ న్యాయస్థానంలో కేసును సమర్థవంతంగా వాదించిన Addl. PP శ్రీ M. బాలాజీ గార్లను జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు అభినందించారు.

No comments:

Post a Comment