Wednesday, 9 September 2026

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

 అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి 

- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 

చిత్తూరు, ఫస్ట్ న్యూస్ 4 యు 




కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.




బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించేందుకు బుధవారం కాణిపాకం ఆలయ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరగనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి కావలసిన అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యవేక్షణ లోపం లేకుండా పగడ్బందీగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాలన్నారు. 



జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ఆలయ బ్రహ్మోత్సవాలలో దొంగతనాలు దోపిడీలు జరగకుండా కట్టుదిడ్డమైన అన్ని రకాలైన చర్యలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపడతామన్నారు. కావలసిన పోలీసు బలగాన్ని నియమించామన్నాడు. ఆలయ అధికారులతో ఉభయదారులతో సమన్వయం చేసుకొని బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలన్నారు. 



పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాకం ఆలయం ప్రాంగణం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కాణిపాకం ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది కలిసికట్టుగా బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళి మోహన్, ఎస్‌పి తుషార్ దూది, ఆలయ ఈవో పెంచల కిషోర్ తదితరులు హాజరయ్యారు.

No comments:

Post a Comment