Friday, 11 September 2026

చిత్తూరులో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన - ట్రాఫిక్ సీఐ నరసింహారాజు

 చిత్తూరులో ఫుట్ పెట్రోలింగ్    నిర్వహించిన 

- ట్రాఫిక్ సీఐ నరసింహారాజు 

 చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు


 ట్రాఫిక్ రహిత నగరానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ట్రాఫిక్ సీఐ నరసింహారాజు కోరారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు  నగరంలో ఫుట్  పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా చర్చి వీధి బజారు వీధి గాంధీ రోడ్డు ఎమ్మెస్సార్ సర్కిల్ పరిసర ప్రాంతాలలో దుకాణదారులకు సలహాలు సూచనలు ఇచ్చారు.  రోడ్డుకు ఇరువైపులా దుకాణదారులు వాహనాల రాకపోకలకు పాదాచారుల నడక మార్గానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దుకాణాలను నిర్వహించాలన్నారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. రోడ్డుకు కుడివైపు మూడు రోజులు ఎడమవైపు మూడు రోజులు వాహనాల పార్కింగ్ జరిగేలా దుకాణాధార్లు కూడా భాగస్వామ్యమై చర్యలు చేపట్టాలన్నారు. నో పార్కింగ్ బోర్డు వద్ద ఎవరైనా వాహనాలు పార్కింగ్ చేస్తే జరీమాన తప్పదని హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు నగర ప్రజలు దుకాణాదారులు వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు. దుకాణాధారులు లోడింగ్ అన్లోడింగ్ కార్యక్రమాలను ఉదయం 8 గంటల లోపు ముగించుకోవాలన్నారు. భారీ వాహనాలు నగరం లోపలికి రాకుండా బైపాస్ లోనే వెళ్లాలని సూచించారు. వాహనదారులు వన్వే పద్ధతిని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


No comments:

Post a Comment