Thursday, 1 October 2026

తవణంపల్లి : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఆకస్మికతనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తవణంపల్లి : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఆకస్మికతనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

తవణంపల్లి మండలం మాధవరం స్వర్ణ గ్రామం స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఆకస్మికంగా పర్యవేక్షించిన జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ శ్రీ సునీల్ కుమార్ ఐఏఎస్ గారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లి మండలం స్పెషల్ ఆఫీసర్ మరియు సమగ్ర శిక్ష ఏపీసి మద్దిపట్ల వెంకటరమణ మండల తహసిల్దారు మండల రెవెన్యూ అధికారి పాల్గొన్నారు .ఈ సందర్భంగా కలెక్టర్ గారు స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చారు వాటిలో 1)స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ నందలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు పదివేల రూపాయల కేటాయింపు 



2,)స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ నందుగల స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి VBGRAMGనిధులు మంజూరు చేయడం 

4)స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ నందు అంగన్వాడీ కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణానికి VBGRAMG నిధులు 

5) స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ నందు ఆవులయ్య ఇంటి పరిసరాలు యందు రివేట్ మెంట్ పనులకుVBGRAMG నిధుల‌ మంజూరు 

6) శ్రీమతి రాణి వారికి వితంతు పెన్షన్ మూడు నెలలపాటు నెలకు 4000 రూపాయలు చొప్పున మొత్తం 12,000 రూపాయలు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది 

7)గృహములు లేనివారికి స్థలములు కేటాయించవలసిందిగా తహసిల్దారు వారికి తెలియజేశారు .

8)ప్రభుత్వ బోరు నుండి పైపులు వేయుటకు నాలుగు లక్షల రూపాయలు కేటాయింపు.

No comments:

Post a Comment