Tuesday, 8 September 2026

దళిత వాడ పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదు

 దళిత వాడంటే ప్రభుత్వానికి,అధికారులకు నిర్లక్ష్యమా?
చిత్తూరు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ పి హెచ్ వాడను పర్యటించాలని విజ్ఞప్తి 
మురికి కాలువపై మూత మూయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 15 న నిరసన దీక్ష 
సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి. యస్. నాగరాజు 

చిత్తు ఫస్ట్ న్యూస్ 4 యు 



 చిత్తూరు జిల్లా కేంద్రం లోని 39 వ డివిజన్ పెద్ద దళితవాడలో  మురికి కాలువ నిర్మించి సుమారు 8 నెలలు  కావస్తున్నా మూత వేయడంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు దళితవాడలో పట్ల నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారని తీవ్రంగా తప్పుపట్టారు మురికి కాలువ  నిర్మాణం చేపట్టి న మురికి నీళ్లు కూడా సరిగా ప్రవహించడం లేదని మురికి  నీళ్లు  ప్రవహించా  కపోవడంతో  ప్రజలకు రోగాలు వస్తున్నాయి అని తీవ్రంగా విమర్శించారు మురికి కాలువలు పై మూత వేయకపోవడంతో మహిళలు, వయసు మీరిన ముసలివారు పిల్లలు పడిపోయారని ద్విచక్రాలు వాహనాలు పోయేవాళ్ళు ఇబ్బందులకు గురి అవుతున్నారని  అనేకసార్లు నగరపాలక సంస్థ అధికారులకు ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్లకు తెలియజేసిన పెద్ద దళితవాడ పట్ల అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు 

జిల్లా కలెక్టర్ , నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ గా మీరైనా జోక్యం చేసుకొని పెద్ద దళిత వాడను ఒక్కసారి పర్యటించి వాస్తవాలను తెలుసుకొని దళిత వాడ కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 15 న నిరసన దీక్ష చేపట్టనున్నట్లు  సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు హెచ్చరించారు

No comments:

Post a Comment