*సైన్స్ ద్వారానే ప్రజలలో సమస్యలు పరిష్కారం అవుతాయి*
- విఠపు బాలసుబ్రమణ్యం
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
జనవిజ్ఞాన వేదిక జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఇవాళ విజయం ఇంజనీరింగ్ కాలేజ్ చిత్తూరులో ఘనంగా జరిగింది ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ నార్మల్ బోర్లాంగ్ పొట్టి రకాల వరి వంగడాలు కనిపెట్టడం ద్వారా కోట్ల మంది ఆకలి తీర్చి భారతదేశము స్వయం సమృద్ధిని సాధించేందుకు తోడ్పడ్డారు. సైన్స్ ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతుంది అని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 28 మండలాల నుంచి 40 టీములు ఈ జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొన్నాయి. ఉదయం స్క్రీన్ టెస్ట్, అందులో ఎన్నికైన వాళ్ళకి క్విజ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మొదటి స్థానంలో వచ్చిన రెండు టీములు నవంబర్ 1, 2 ,3 తేదీలలో భీమవరంలో జరగబోయే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలలో పాల్గొంటారు.
జిల్లా అధ్యక్షులు అరుణ్ శివప్రసాద్ గారు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్ బాబు రాసిన ప్రయోగాలతో శాస్త్రీయ దృక్పథం పుస్తకాన్ని విఠపు బాలసుబ్రమణ్యం గారు ఆవిష్కరించారు. పాల్గొన పిల్లలందరికీ ఈ పుస్తకాలు బహుకరించారు. విజయం విద్యాసంస్థల అధినేత శైలజ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎం వి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ తరఫున శ్రీధర్ రెడ్డి గారు పాఠశాలలకు మెమెంటోస్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిలింఫేర్ ఖాన్, పిల్లారప్ప ,వేణుగోపాల్, విజయ్ కుమార్ లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో జయంతి , పర్యావరణ విభాగం సుధాకర్, గిరిధర్ మూర్తి, నాగేశ్వరరావు ,ZSSనాయుడు, బాబు, సుదర్శనాచారి ఇతరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల నుండి *జిల్లా పరిషత్ పాఠశాల పులిచెర్ల*,ప్రైవేట్ రంగంలో *రెయిన్బో ఇంగ్లీష్ ఫీడింగ్ హై స్కూల్* చిత్తూరు మొదటి స్థానంలో నిలిచారు.

No comments:
Post a Comment