Sunday, 6 September 2026

ఈనెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ కమిషనర్

ఈనెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ కమిషనర్

వ్రుందా మనోహర్ దేశాయి (SHRI VRUNDA MANOHAR DESAI), రాష్ట్రచేనేత మరియు జౌళి శాఖ, కమీషనర్,  జి. రేఖ రాణి, నగిరి పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు

- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్




చిత్తూరు, సెప్టెంబర్,6: ఫస్ట్ న్యూస్ 4 యు 


 ఈనెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ కమిషనర్

వ్రుందా మనోహర్ దేశాయి (SHRI VRUNDA MANOHAR DESAI), మరియు మరియు రాష్ట్రచేనేత మరియు జౌళి శాఖ, కమీషనర్, శ్రీమతి జి. రేఖ రాణి, నగిరి పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు అనిజిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.


 08.09.2026 న ఉదయం 11:30 నుండి నగిరి పట్టణం నందుగల Integrated Textile and Apperal Centre,, Nagari (ITDAC) మరియు స్థానికముగా గల పవర్లుం ఉత్పత్తి కేంద్రములను మరియు డైయింగ్ కేంద్రములను సందర్శిస్తారు


 తదుపరి మ|| 3.30 గం|| నుండి SRI S,M.T.PONNUSWAMY SANKARAMMAL KALYANA MANDAPAM, రైల్వే స్టేషన్ వద్ద, ఏకాంబరకుప్పం నందు స్థానికముగా గల పవర్ లూము యూనిట్ హోల్డర్స్, పవర్ లూము స్టాక్ హోల్డర్స్, టెక్మైల్ యూనిట్స్, మరియు పరిశ్రమకు సంబంధించిన సంఘముల వారితో, కేంద్ర ప్రభుత్వము వారు నూతనముగా ప్రవేశపెట్టిన Textiles Statistical Returns System (TSRS) వ్యవస్థ నందు నమోదు చేసుకొనట గురించి, అందువలన ప్రయోజనముల గురించి, రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల జిల్లా లోని 3400 మంది పవర్ లూము యూనిట్ల వారికి అమలు చేసిన 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకము గురించి, అంతేకాక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వముల వారు నూతనముగా ప్రవేశపెట్ట బోవు పథకముల గురించి ఒక workshop ను నిర్వహించేదరు.


కావున యావన్మంది పవర్ లూము యూనిట్ హోల్డర్స్, పవర్ లూము స్టాక్ హోల్డర్స్, టెక్స్టైల్ ఉనిట్స్, మరియు Industries Associations వారు ఈ సమావేశమునకు హాజరై వారియొక్క సలహాలు మరియు సూచనలు వెల్లడించి, పవర్లూమ్స్ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనవలెనని జిల్లా కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారు



తవణంపల్లిలో దుర్యోధన వధ

 - తవణంపల్లి లో కనుల విందుగా మహాభారతం
- దుర్యోధన వధ 
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



తవణంపల్లి సెప్టెంబర్ 6 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లిలో ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో ఆలయ ధర్మకర్త గుడిసి మన స్వామి శెట్టి గ్రామస్తులు యువజన సంఘం పరిసరల గ్రామస్తులు ఆధ్వర్యంలో 121వ మహాభారత ఆదివారం  దుర్యోధన వద ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ 17. 8 .2026 నుండి6 . 9 .2026 వరకు ఆఖరి ఘట్టం దుర్యోధన వద మహాభారతం గ్రామస్తుల ఆధ్వర్యంలో  17.8.2026 సోమవారం ప్రారంభం నుండి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు హరికథ కాలక్షేపం టి టి డి ఆర్టిస్ట్ జి హేమవతి భాగవతరిణి గారిచే మహాభారత హరికథ కాలక్షేపం 24. 8. 26 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బకాసురుడు బలి బండి పై బకాసురుడు అదే రోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 14 రోజులు రాత్రి నాటకంలో తమిళంలో నాటకదారులు ఉమామహేశ్వరి నాటిక మండలి మాదిరెడ్డిపల్లి వారిచే మేనేజర్స్ ఎం. వినాయక ,సత్యమూర్తి, కె.వి కుప్పం ఏ.మని. కే. గణేష్. వారిచే రాత్రి నాటకంలో అంగరంగ వైభవంగా జరిగింది చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాభారత యజ్ఞాన్ని ఆఖరి ఘట్టం దుర్యోధన వద లను తిలకించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గుడిసి మనసామిశెట్టి గ్రామస్తులు యువజన సంఘం చుట్టుపక్క గ్రామస్తులు పాల్గొన్నారు

అరగొండ అపోలో హాస్పిటల్ లో న్యూరో సర్జరీ వైద్య నిపుణులచే వైద్య చికిత్స శిబిరం

 అరగొండ అపోలో హాస్పిటల్ లో న్యూరో సర్జరీ వైద్య నిపుణులచే వైద్య చికిత్స శిబిరం

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


తవణంపల్లి సెప్టెంబర్ 5 తవణంపల్లి మండలం అపోలో అరగొండ హాస్పటల్ నందు సెప్టెంబర్ 6 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ప్రముఖ వైద్య సర్జన్ నిపుణులు డాక్టర్ సాయినాథ్ వారి బృందం వైద్య నిపుణులచే తలలోని గడ్డలు .తల గాయాలు. మెడ నొప్పి .సయాటికా. వెన్నునొప్పి .వెన్నుముక డిస్క్ సమస్య. వెన్నుపూస గాయాలు. పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, వాస్కులర్ న్యూరో సర్జరీ, క్లిప్పింగ్ రక్తనాళా బుడగ క్లిప్పింగ్ ఎం .వి. డి పర్ ట్రై జమినల్ న్యూరో ల్దియావర్ది బ్రో ప్లాలిష్టి కైపాప్లాష్టి పక్షవాతము  డికం ప్ర ష న్ సర్జరీ కోత కట్టు లేకుండా మెదడు మరియు వెన్నుముక ఆపరేషన్ చికిత్స శిబిరం జరిగింది మొత్తం 25 మంది హాజరయ్యారు ఇందులో న్యూరో సర్జరీస్ నాలుగు మంది సెలెక్ట్ చేసి వీరిని రాయితీతో చికిత్స చేయడం జరుగుతుందని  అరగొండ అపోలో హాస్పటల్ పి ఆర్ ఓ కమ్రుద్దీన్ తెలిపారు

Saturday, 5 September 2026

జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం*


 జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం*
*2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం – 12 విభాగాల్లో పురస్కారాలు*
*రూ.2 లక్షల నుంచి రూ.1 లక్ష వరకు నగదు పురస్కారాలు – సెప్టెంబరు 28లోగా దరఖాస్తులు*
*రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్*

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



చిత్తూరు, సెప్టెంబరు 6, :  జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోగా కింది చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు.


డైరెక్టర్,

సమాచార పౌరసంబంధాల శాఖ,

2వ అంతస్తు, ఎన్టీఆర్ పరిపాలన భవనం,

పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్,

విజయవాడ – 520013.


*కమిటీ విచక్షణాధికారంతో ఎంపిక చేసే పురస్కారాలు*


కింది మూడు పురస్కారాలకు జర్నలిస్టుల నుంచి ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించకుండా, ఎంపిక కమిటీ తన విచక్షణాధికారంతో పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది.

1. వి.ఆర్. నార్ల జీవిత సాఫల్య పురస్కారం

2. కొక్కు అహోబలరావు ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డు

3. మద్దూరి అన్నపూర్ణయ్య పేరిట రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంపాదకులకు అందించే అవార్డు


*దరఖాస్తుల ఆధారంగా కమిటీ ఎంపిక చేసే అవార్డులు*


1. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.2 లక్షలు


అర్హతలు:

జర్నలిజం వృత్తిలో కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పూర్తికాలపు జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న పేరొందిన తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పీరియాడికల్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లో లేదా రాష్ట్రం వెలుపల పనిచేస్తున్న జర్నలిస్టులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


2. ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డులు


గ్రామీణ జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు జర్నలిస్టులకు ప్రముఖ పాత్రికేయుల పేర్లతో మూడు అవార్డులు అందజేస్తారు.


- ఖాసా సుబ్బారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు

- ముట్నూరి కృష్ణారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు

- మద్దుకూరి చంద్రశేఖరరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు


ఒక్కో అవార్డు నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగిన పాత్రికేయులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రామీణ రిపోర్టింగ్‌లో విశేష అనుభవం గడించిన మాజీ జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


3. సావిత్రిబాయి పూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

రాష్ట్రంలో వెలువడే తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పీరియాడికల్స్‌లో పనిచేస్తున్న మహిళా రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


4. ఉత్తమ కార్టూనిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.


5. అబుల్ కలాం ఆజాద్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

ఉర్దూ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తూ కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉర్దూ జర్నలిజానికి అందించిన సేవలు, గ్రామీణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చేసిన రిపోర్టింగ్‌, మొత్తం వృత్తిపరమైన పనితీరును ప్రామాణికంగా తీసుకుని అవార్డు గ్రహీతను ఎంపిక చేస్తారు.


6. ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారమయ్యే ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. దూరదర్శన్‌, రేడియోలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


7. ఉత్తమ వీడియో జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు విధానం – ముఖ్య నిబంధనలు


* జర్నలిస్టులు తాము పనిచేస్తున్న సంస్థ, ఉద్యోగ వివరాలు, తమ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి.


* దరఖాస్తుతో పాటు కనీసం 5 వ్యాసాలు, వార్తా కథనాలు, ఫొటోలు, కార్టూన్లు లేదా వీడియో క్లిప్పింగ్స్‌ జతచేయాలి. అవి 2025 క్యాలెండర్ సంవత్సరంలో (01-01-2025 నుంచి 31-12-2025 వరకు) ప్రచురితమైనవి/ప్రసారమైనవి అయి ఉండాలి.


* వ్యాసాలు, వార్తా కథనాలు తదితర ఆర్టికల్స్‌ను ఫొటోకాపీల రూపంలో కూడా దాఖలు చేయవచ్చు.


* అవార్డు గ్రహీతల ఎంపికకు సంబంధించి ఎంపిక కమిటీదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.


* ఏదైనా విభాగంలో తగిన సంఖ్యలో లేదా తగిన ప్రమాణాలతో దరఖాస్తులు అందలేదని కమిటీ భావించినట్లయితే, సంబంధిత అవార్డును ప్రకటించకుండా నిలిపివేసే అధికారం ఎంపిక కమిటీకి ఉంటుంది.


* ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని మీడియా రిలేషన్స్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు:  (https://mediarelations.ap.gov.in/media)



ఇద్దరు దొంగలు అరెస్ట్

*వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ.13 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్న కల్లూరు పోలీసులు.*

*జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు.*

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 106 రామిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన ఎం. శంకర్ రెడ్డి ఇంటిలో 15.05.2026 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 8 గ్రాముల బంగారు చైన్ మరియు రూ.20,000/- నగదు దొంగతనం చేసిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కల్లూరు పోలీస్ స్టేషన్‌లో Cr.No.47/2026 U/s 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


దర్యాప్తులో భాగంగా చిత్తూరు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సిబ్బందిని సంఘటనా స్థలానికి రప్పించి పరిశీలించగా, అక్కడ లభించిన వేలిముద్రలు రొంపిచెర్ల మండలం దద్దాలవారిపల్లికి చెందిన ఆవులకుంట నరేష్‌కు సంబంధించినవిగా గుర్తించారు.



చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS., గారి ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్.డి.పి.ఓ శ్రీ జె.వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో, కల్లూరు సి.ఐ. శ్రీ యం.జయరామయ్య గారి పర్యవేక్షణలో, కల్లూరు ఎస్.ఐ. శ్రీ యు.వెంకటేశ్వర్లు గారు దర్యాప్తు కొనసాగించారు.


ఈ క్రమంలో 05.09.2026 సాయంత్రం 05.00 గంటల సమయంలో పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు పులిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.


నిందితులను విచారించగా, ప్రధాన నిందితుడు ఆవులకుంట నరేష్ 2025 సంవత్సరంలో కొత్తపేటలో అబ్దుల్ మునాఫ్ ఇంటిలో, కల్లూరు–పులిచెర్ల రహదారిలో వగాళ్లవారిపల్లి సమీపంలోని ఎల్లమ్మ గుడిలో, 106 రామిరెడ్డిగారిపల్లిలో, బలిజిపల్లిలోని ఏకాంబరం ఇంటిలో దొంగతనాలకు పాల్పడినట్లు నేరం అంగీకరించాడు.


అదేవిధంగా పీలేరు పరిధిలోని ఒక ఆలయంలో, చంద్రగిరి మండలంలోని మరో ఆలయంలో కూడా దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.


ఈ దొంగతనాల్లో పిన్న బోయున శ్రీనివాసులు నిందితుడు నరేష్‌కు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దొంగతనం చేసిన బంగారు వస్తువులను వివిధ బంగారు దుకాణాల్లో విక్రయించి, వచ్చిన డబ్బుతో ఇద్దరూ జల్సాలు చేసేవారని విచారణలో వెల్లడైంది.


వీరి వద్ద నుండి రూ.2,42,000/- నగదు, 78 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి మొత్తం విలువ సుమారు *రూ.13,00,000/- విలువ సొత్తును స్వాదీనం చేసుకున్నారు.


నిందితులను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న దొంగసొత్తును రికవరీ చేసిన కల్లూరు పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు అభినందించారు.


*ముద్దాయిల వివరాలు:*

1. ఆవులకుంట నరేష్, వయస్సు 36 సంవత్సరాలు, తండ్రి: సుబ్రమణ్యం, దద్దాలవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం.

2. పిన్న బోయున శ్రీనివాసులు, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి/సంరక్షకురాలు: సుభాషిణి, బద్వేల్, కడప జిల్లా, ప్రస్తుతం తిరుపతి అక్కరంపల్లి, మంగళం రోడ్డులో నివాసం.

విద్యార్థులందరూ చిట్టిగులుగా మారాలి - నిరక్షరాస్యతను రూపుమాపాలి*

 *విద్యార్థులందరూ చిట్టిగులుగా మారాలి - నిరక్షరాస్యతను రూపుమాపాలి*




అక్షరాస్యత పక్షోత్సవాలలో భాగంగా ఈరోజు చిత్తూరు ప్రభుత్వ కన్నన్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు *"వయోజనులకు అక్షరాస్యత ఆవశ్యకత - సమాజంలో అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత"* అను అంశాలకు సంబంధించి చర్చ గోష్టిని ఏర్పాటు చేయడం జరిగినది . 


ఈ సందర్భంగా వయోజన విద్య ఉపసంచాలకులు మహమ్మద్ ఆజాద్ వయోజనులకు అక్షరాస్యత ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరంగా చెప్పడం జరిగింది . అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులలో నిరక్షరాస్యులుగా ఉన్నవారికి మరియు విద్యార్థుల పరిసరములలో ఉన్న నిరక్షరాశులకు విద్యార్థులే చిట్టి గురువులుగా మారి చదువు నేర్పించాలని కోరారు . 


ఈ చర్చ గోష్టి లో విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొనడం జరిగినది . ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీమతి నాగవల్లి గారు మాట్లాడుతూ అక్షరాస్యత అమలు కోసం ఇదివరకు అక్షర సంక్రాంతి , అక్షర తపస్మాన్ , అక్షర యజ్ఞం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్నారు . ప్రస్తుతం అక్షర ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొని తమ వంతు సహకారం ఈ కార్యక్రమానికి అందించవలసిందిగా కోరడం జరిగినది . 


ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి చిట్టి గురువుగా మారి తన పరిసరములలో ఉన్న ఒక నిరక్షరాస్యునికి చదువు చెప్పాలని కోరారు . ఈ కార్యక్రమంలో వయోజన విద్య పర్యవేక్షకులు కందేశ్వర రావు మాట్లాడుతూ  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు . అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో అక్షరాస్యతకు సంబంధించిన నినాదాలు చెబుతూ ర్యాలీని నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .

ఓలా - ఉబర్- రాపిడో- బైక్ టాక్సీ లను రద్దు చేయాలి

 ఓలా - ఉబర్- రాపిడో- బైక్ టాక్సీ లను రద్దు చేయాలని కోరుతూ 7వ తేదీన జరిగే ధర్నా లో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలి  

          ఏఐటీయూసీ పిలుపు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:





 ఆటో డ్రైవర్ల సమస్యలతో పాటు ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ నెల 7వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు  మహాత్మా గాంధీ విగ్రహం వద్ద


 ఏఐటియుసి ఆధ్వర్యంలో జరిగే ఆటో డ్రైవర్ల  ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం  కాంక్షిస్తూ చిత్తూరు భగత్ సింగ్ స్టాండ్ వద్ద ఏఐటీయూసీ నాయకత్వంలో కరపత్రాలు నాయకులు విడుదల చేశారు 


ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ గౌర అధ్యక్షులు ఎస్. నాగరాజు చిత్తూరు జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.విజయ్ కుమార్ లు మాట్లాడుతూ   ఓలా ఉబర్ రాపిడో  బైక్  టాక్సీ లను యాప్ ఆన్లైన్ ద్వారా నడపడం వల్ల  ఆటో డ్రైవర్ల బ్రతుకులు చిన్నాభిన్నమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లకు రోజువారి ఆదాయం లేక డ్రైవర్లు ఫైనాన్స్ కంపెనీల్లో  కంతులు చెల్లించలేక అప్పుల పైన అప్పులు చేసి తన కుటుంబాన్ని  పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు  ఇలాగనే కొనసాగితే ఆటో డ్రైవర్ల  కుటుంబాలు వారి బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన  చెందారు మన బ్రతుకు కొరకు మన బ్రతుకు కోసం  సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లు  నిర్వహించే  నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు  పెద్ద ఎత్తున  పాల్గొని గాంధీ విగ్రహం వద్ద నుండి చిత్తూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ గురుజాల జగన్మోహన్ ఎమ్మెల్యే గారికి ఆటో డ్రైవర్ల బాధలను తెలియజేసి  వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు


 ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, కే.మణి,వి. సి. గోపినాథ్,చిత్తూరు ఆటో డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి పి.రఘు యూనియన్ ఉపాధ్యక్షులు శివకుమార్, డిహెచ్పిఎస్ నాయకులు పి. గజేంద్రబాబు ఆటో యూనియన్ నాయకులు సామెల్, యేసు, జయ కుమార్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయురాలు సురేఖకు ఉత్తమ అవార్డు

 మానసిక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన
ఉపాధ్యాయురాలు సురేఖకు ఉత్తమ అవార్డు 
సిఐటియు అభినందనలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడంలో విశిష్ట సేవలు అందించిన జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా సతీమణి సురేఖకు సిఐటియు నుంచి అభినందనలు 



శనివారం చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గంగవరం మండలంలో వికలాంగుల విద్యార్థిని విద్యార్థులకు విద్య నేర్పించడంలో అత్యుత్తమ సేవలందించిన ఉపాధ్యాయురాలు సురేఖకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకోవడం అభినందనీయం. జిల్లాలో మొత్తం 75 మందికి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు అందించడం జరిగింది. వివిధ రకాల రంగాలలో సేవలు అందించిన వారికి డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా ఈ అవార్డులు ప్రధానం చేశారు. మామూలు పిల్లలకు విద్య నేర్పడం ఒక రకం అయితే మానసిక విద్యార్థులకు చదువు నేర్పడం మరో ఎత్తు అని పలువురు కొనియాడారు. చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ చాలా ఓపికతో మానసిక విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయురాలు  సురేఖ గొప్ప ఉపాధ్యాయురాలని కొనియాడారు. ఆమె అందరికీ ఆదర్శం అన్నారు.ఈమెను ఆదర్శవంతంగా తీసుకొని మిగిలిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా పిల్లల భవిష్యత్తుకు కృషి చేయాలని తెలిపారు. 

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సురేఖకు సిఐటియు జిల్లా కమిటీ నుంచి అభినందనలు తెలిపిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు ,మాజీ జిల్లా కార్యదర్శి సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

 గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వద్ద జాతీయ రహదారిపై పొలం దగ్గర నుండి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు ప్రక్కన నిల్చుని ఉండగా పలమనేరు వైపు నుండి చిత్తూరు వైపు వెళుతున్న వాహనం ఢీకొని సుమారు 20మీటర్ల దూరం లాక్కొని వచ్చి వెళ్లిపోవడం జరిగింది.ఈ ప్రమాదంలో గుండ్లకట్టమంచి హరిజన వాడకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎన్ఆర్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

 సీఎన్ఆర్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



గుడిపాల మండలం సిఎన్ఆర్ విద్యాసంస్థలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జీవితానికి అర్థాన్ని దిశనిచ్చేది ఉపాధ్యాయుడు అన్నారు. మనకు విద్యతోపాటు క్రమశిక్షణ ,మంచి ప్రవర్తన, నైతిక విలువలు నేర్పించేది ఉపాధ్యాయుడు అన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వారి పాదాలకు ఇచ్చేగౌరవమే మన సంస్కారం అన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు మాత్రమే చెప్పడు. ఆశయాన్ని నూరిపోస్తాడు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడన్నారు. తదనంతరం కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుధ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి అర్జున్, ఎన్సిసి ఏ సి ఓ హేమంత్ కుమార్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గురుపూజోత్సవం

 ఘనంగా గురుపూజోత్సవం 

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం కృషి చేయాలి.

------ ప్రిన్సిపల్ డాక్టర్ ధనంజయ 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



నరసింగ రాయనపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారతరత్న పూర్వభారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం దీక్షతో పనిచేయాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం వారి బాట నేటి విద్యార్థులకు స్ఫూర్తి అని తెలిపారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శరశ్చంద్రశేఖర్ ,మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి మానవీయ విలువలను తన ఉపాధ్యాయ వృత్తి ద్వారా విద్యార్థులకు అనేకమంది రాజకీయ నాయకులకు సమాజానికి తెలిపిన గొప్ప తత్వవేత్తని వారి జీవితం సమాజానికి ఎంతో ఆదర్శవంతమైందని తెలుపుతూ గురువుల యొక్క ప్రాముఖ్యతను నేటి సమాజంలో వారి పాత్రను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళాశాల అధ్యాపకులు అందరికీ ఘనంగా సన్మానం చేశారు కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు వినాయక ఫయాజ్ లక్ష్మణ్ మహేష్ లావణ్య నారాయణి విద్యార్థులు రాకేష్ ,బాబు ,అజయ్,ప్రీథమ్ జేషు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు



రోడ్డు ప్రమాదంలో ఎంఈవోకు తీవ్ర గాయాలు

 రోడ్డు ప్రమాదంలో ఎంఈవోకు తీవ్ర గాయాలు

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 




మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లె ఎంఈవో జనార్దన్‌రెడ్డి (50) తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటికి చెందిన జనార్దన్‌రెడ్డి బైరెడ్డిపల్లె ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.


శుక్రవారం స్వగ్రామం నుంచి కారులో బైరెడ్డిపల్లెకు బయలుదేరిన ఆయన.. మదనపల్లె మండలం 150వ మైలు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వ్యాను కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమవగా, జనార్దన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.


స్థానికులు వెంటనే ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గురువులే భావి భారత నిర్మాతలు

 గురువులే భావి భారత నిర్మాతలు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



2047 విజన్ వికసిత భారత్ లక్ష్యం నెరవేర్చే భాగస్వామ్యులు గురువులే అని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ అన్నారు. సెప్టెంబర్ 5 గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జడ్పీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ వేడుకలు విజయవంతం ఆయన సందర్భంగా ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు గ్రామంలో జన్మించి ఉపాధ్యాయుడిగా అధ్యాపకుడిగా అంచలంచలుగా ఎదిగి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా  ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఉపాధ్యాయుడిగా ఆయన సేవలను కొనియాడుతూ ఆయన జన్మదినాన్ని గురుపూజోత్సవంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆయనను నేటి గురువులు ఆదర్శంగా తీసుకొని విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గురుపూజోత్సవం రోజు చిత్తూరు జిల్లాకు చెందిన 72 మంది గురువులను ఘనంగా సన్మానించామన్నారు. వారిని అందరూ ఆదర్శంగా తీసుకొని తరగతి గదిలో ఉత్తమ పౌరులను తీర్చిదిద్ది సమాజానికి అందించాలన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఏకైక ఆయుధం గురువులే అన్నారు.

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు ఉచితం

వినాయక మంటపాల ఏర్పాటుకు అనుమతులు ఉచితం – సింగిల్ విండో విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి.




*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా మంటపాల ఏర్పాటుకు “ganeshutsav.net” ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. అనుమతుల కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.*

ఇంతకు ముందు వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం తీసుకోవలసి ఉండేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించినది.

ప్రజలు *“ganeshutsav.net”* అనే వెబ్సైట్ నందు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేసి దరఖాస్తును, ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి.


*దరఖాస్తు  విధానం:*

మొదటగా దరఖాస్తు చేయదలచిన వారు *“ganeshutsav.net”* Website open చేసి New application అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

 తరువాత దరఖాస్తు దారుని మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయవలయును. తరువాత సదరు మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయవలయును.

ఆ తరువాత దరఖాస్తు దారుని పేరు, అడ్రస్ మరియు కమిటి సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయవలయును.

 అప్పుడు Application ID No. (Unique ID) Generate చేయబడి, సదరు దరఖాస్తు పోలీస్ శాఖ యొక్క అనుమతి కోసం వారి logins కు వెళుతుంది. 

అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అనుమతించిన తరువాత ఆ వివరాలు website నందు వచ్చును. దీనికోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. 

అనుమతికి సంభందించిన QR Code మరియు నిర్వాహకులు పాటించవలసిన నియమ నిబంధనలను తెలిపే ఒక BOOKLET DOWNLOAD అగును.


*నిర్వాహకులు నిరభ్యంతర పత్రం (NOC) మరియు నియమ నిబంధనలు కూడిన పత్రాలను ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచవలెను. పోలీసువారు సందర్శన సమయములో QR కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.*


శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రమాదాలు మరియు ఘర్షణలకు తావులేకుండా పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసు శాఖకు ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, కోరారు.

Friday, 4 September 2026

మాజీ మంత్రి రోజాకు ఆహ్వానం

 *గంగమ్మ జాతర మహోత్సవానికి మాజీ మంత్రి రోజాకు ఆహ్వానం*

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

నగరి పట్టణం బజారు వీధిలో ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న శ్రీ గంగమ్మ జాతర మహోత్సవానికి మాజీ మంత్రి R.K. రోజా ని జాతర కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులందరూ ఈరోజు నగరిలోని మాజీ మంత్రి రోజా గారి నివాసానికి చేరుకుని, జాతర మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆమెకు అందజేశారు. జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు మాజీ మంత్రి రోజాని కోరారు. గంగమ్మ జాతర మహోత్సవం ఘనంగా, విజయవంతంగా జరగాలని మాజీ మంత్రి రోజా  ఆకాంక్షించారు.





ఇస్కాన్ ఆలయంలో భక్తుల కిటకిట

*ఇస్కాన్ ఆలయ చరిత్ర, విశిష్టత*

శ్రీకృష్ణాష్టమి వేడుకలు 




శ్రీకృష్ణుని తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే సంకల్పంతో 1966 జూలై 13న భక్తివేదాంత స్వామి ప్రభుపాద అనే ఆధ్యాత్మికవేత్త అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 70 ఏళ్ల వయసులో కేవలం రూ.40లతో ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ISKCON అంటే *International Society for Krishna Consciousness*. భగవద్గీత, భాగవతంలోని కృష్ణ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడమే ఈ సంస్థ లక్ష్యం.


500 ఏళ్ల క్రితం చైతన్య మహాప్రభు అందించిన *"హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే"* అనే మహామంత్రాన్ని ప్రభుపాద ప్రపంచానికి తీసుకెళ్లారు. ఈ ఆలయాల్లో రాధాకృష్ణులు, గౌర-నితాయి, జగన్నాథ-బలదేవ్-సుభద్ర విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇక్కడ కేవలం దర్శనానికే కాకుండా నామ సంకీర్తన, భగవద్గీత తరగతులు, ప్రసాదానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అక్షయపాత్ర సంస్థ ద్వారా కోట్లాది మంది పిల్లలకు ఉచిత భోజనం అందిస్తున్నారు.






*శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా...*


తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి హరే కృష్ణ నామాన్ని జపిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.


భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.


ఉదయం నుండి రాత్రి వరకు భక్తజన సందోహంతో తిరుపతి కళకళలాడింది. విద్యుత్ దీపాల కాంతులతో దశావతారాలు, గరుడ పురాణం, శ్రీకృష్ణ లీలలు, మహావిష్ణు అవతారాలు వంటి కళాత్మక రూపాలను ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేశారు.


క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీకృష్ణునికి సంబంధించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు శ్రీకృష్ణుడు, రాధ, గోపిక వేషధారణలో మాడవీధుల్లో తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నారు.


ఆలయాన్ని సందర్శించిన భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు ప్రసాద వితరణ, త్రాగునీటి సౌకర్యం, కనీస వసతులు కల్పించారు. తిరునాళ్లను తలపించే విధంగా తిరుపతిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి.


అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

గుడిపాల మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



గుడిపాల : చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం సాయంత్రం గుడిపాల మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం గుడిపాల మండలం చీలాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీ-సర్వే ప్రాజెక్టులో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం సి.బండపల్లి గ్రామంలో నూతన తాగునీటి బోరును ప్రారంభించారు. గుడిపాల ఇందిరానగర్ కాలనీలో పైప్ లైన్లను, ముత్తువాళ్లూరులో వీధి దీపాలను ప్రారంభించారు. స్థానికంగా గ్రామాల్లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తాహశీల్దారు శ్రీనివాసులు, మండల తెదేపా అధ్యక్షుడు సుబ్బానాయుడు, కూటమి నాయకులు బాలసుబ్రహ్మణ్యం యాదవ్ దీపశ్రీ, రూప్ కుమార్, పాల్గొన్నారు.


ట్రాఫిక్ నియంత్రణకు కృషి

 ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు 

ఫ్రెండ్లీ పోలీసింగ్ పెంచండి 

- ట్రాఫిక్ సిఐ నరసింహారాజు 


చిత్తూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు సిబ్బంది కృషి చేయాలని ట్రాఫిక్ సీఐ నరసింహ రాజు అన్నారు శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎన్నికలు రానున్న నేపథ్యం వినాయక చవితి వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షణ చేపట్టాలన్నారు హై రోడ్డు చర్చి వీధి ఓటికె రోడ్డు డిఐ రోడ్డు పాత బస్టాండు మార్కెట్ చౌక్ ఎంఎస్ఆర్ సర్కిల్ వంటి రద్దీ ప్రాంతాలలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలతో మమేకమై వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ  పైన ట్రాఫిక్ సిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు వినాయక చవితి రోజున ట్రాఫిక్ మళ్లింపు పైన శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు వినాయక చవితి రోజు మండపాల నిర్వాహకులు చేపట్టవలసిన చర్యల పైన అవగాహన కల్పించాలని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.





చంద్రబాబు దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు 

విశాఖలో జరిగే రాష్ట్ర మహాసభలకు రావాలని ఆహ్వానం

చంద్రబాబు దృష్టికి జర్నలిస్టుల సమస్యలు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(APWJF) నేతలు కలిశారు. సచివాలయంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు ఆధ్వర్యంలో నేతలు కలిశారు. విశాఖపట్నం వేదికగా త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఆహ్వానించారు. పారిశ్రామిక రాజధాని విశాఖలో జరిగే రాష్ట్ర మహాసభలకు తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎపిడబ్ల్యుజేఎఫ్ నేతలు తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు, రాష్ట్ర నాయకులు కలిమి శ్రీ, ఆనంద్, మీరా తదితరులు పాల్గొన్నారు.

24 గంటల్లో హ_త్య కేసు చేధించిన పోలీసులు

తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకుని అరెస్ట్ చేసిన పెనుమూరు పోలీసులు.

హత్యకు ఉపయోగించిన కోడి కత్తి, ద్విచక్ర వాహనం, స్వాధీనం.

ఒక్క రోజులోనే హత్య కేసును చేదించి ముద్దాయిని అరెస్ట్ చేసిన పోలీసులు – అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


నిందితుడు S. జోకేష్ రెడ్డి @ బాలాజీ ఎల్లంపల్లి ప్రాంతంలో నీరజాక్షి నాయుడు వద్ద హిటాచి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి తిరుపతి జిల్లా, ఆర్.సి.పురం మండలం, అనుప్పల్లి గ్రామానికి చెందిన చూడామణితో వివాహమై 13 సంవత్సరాలు అయింది. కుటుంబ విభేదాల కారణంగా సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం తన ఇంటి నుండి వెళ్లిపోయి పెనుమూరులో వేరుగా నివసిస్తున్నాడు.





02-09-2026 తేదీ రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో నిందితుడి భార్య చూడామణి, నిందితుడి తండ్రి లేట్ S. చెంగా రెడ్డికి ఫోన్ చేసి, నిందితుడు ప్రతిరోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తున్నాడని, గ్రామంలో అప్పులు కూడా ఎక్కువగా చేశాడని తెలిపి, పెనుమూరులోని తమ ఇంటికి రావాలని కోరింది. అయితే నిందితుడి తండ్రి ఉదయం వస్తానని చెప్పాడు.


తన తండ్రి ఉదయం ఇంటికి వస్తే తనను మద్యం సేవించే అలవాటు, అప్పుల విషయమై మందలించి, భార్య ముందు అవమానిస్తాడని భావించిన నిందితుడు, అదే రోజు తన తండ్రిని హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు.


ఈ క్రమంలో తన వద్ద ఉన్న కోడి కత్తిని తీసుకొని, తన ద్విచక్ర వాహనంపై రాత్రి సుమారు 8.00 గంటలకు పెనుమూరు నుండి తన స్వగ్రామమైన మాణిక్యరాయుని పల్లిలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు.


అక్కడ తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయంలో, నిందితుడి తండ్రి అతని మద్యపానం మరియు అప్పుల విషయమై మందలించడంతో నిందితుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ముందుగానే తీసుకువెళ్లిన కోడి కత్తితో తన తల్లి సమక్షంలోనే తండ్రి గొంతు కోసి హత్య చేశాడు. తల్లి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి హత్యకు ఉపయోగించిన కోడి కత్తిని తీసుకొని తన ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు.


ఈ ఘటనపై నిందితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనుమూరు పోలీస్ స్టేషన్‌లో Cr.No.63/2026, సెక్షన్ 103(1) BNS కింద కేసు నమోదు చేసి చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, చిత్తూరు SDPO శ్రీ జె. వెంకటనారాయణ గారి పర్యవేక్షణలో, చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. రామచంద్ర గారి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు.


ఇన్‌స్పెక్టర్  కె. రామచంద్ర గారు పెనుమూరు ఎస్సై పి. శ్రీకాంత్, N.R.పేట SI శ్రీ వి. మణికంటేశ్వర రెడ్డి, చిత్తూరు తాలూకా SI శ్రీ వి. అశోక్ కుమార్, క్రైమ్ పార్టీ మరియు పెనుమూరు పోలీస్ స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.


03-09-2026 తేదీ సాయంత్రం సుమారు 6.00 గంటలకు పెనుమూరు మండలం, పాకాల రోడ్డు, సాయినగర్ కాలనీ, శ్రీ బాలాజీ ఆయిల్ మిల్ సమీపంలో నిందితుడు ఎస్. జోకేష్ రెడ్డి @ బాలాజీని పోలీసులు అరెస్టు చేశారు.


నిందితుడి ఒప్పుకోలు మేరకు హత్యకు ఉపయోగించిన కోడి కత్తి, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం మరియు రక్తపు మరకలు ఉన్న నిందితుడి చొక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


హత్య కేసును వేగంగా ఛేదించి, ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధం, ద్విచక్ర వాహనం మరియు ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. రామచంద్ర, పెనుమూరు ఎస్సై P. శ్రీకాంత్, N.R.పేట SI శ్రీ V. మణికంటేశ్వర రెడ్డి, చిత్తూరు తాలూకా PS SI  V. అశోక్ కుమార్, క్రైమ్ పార్టీ మరియు పెనుమూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS., ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.


*ముద్దాయి వివరాలు:*

S. జోకేష్ రెడ్డి @ బాలాజీ, వయస్సు: 38 సం.లు, తండ్రి: లేట్ S. చెంగా రెడ్డి, లక్ష్మీనగర్ కాలనీ, పెనుమూరు టౌన్ మరియు మండలం, చిత్తూరు జిల్లా.

Thursday, 3 September 2026

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

 రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి 

కృష్ణ విలాస సభ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు 

వైభవంగా వారోత్సవాలు ప్రారంభం 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 




చిత్తూరు నగరంలోని చర్చి వీధిలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి కృష్ణ విలాసభ ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. కళ్యాణ వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులకు చందన అలంకారంతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యంతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కృష్ణాష్టమి పురస్కరించుకొని వారం రోజులపాటు సంతాన వేణుగోపాలస్వామి కృష్ణ విలాస సభ ఆలయంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నాల్గవ తేదీ కృష్ణాష్టమి పురస్కరించుకొని స్వామివారికి చందన అలంకారము, 5 వ తేదీ 154 ఔషధ మూలికల ద్రవ్యాలతో విశేష అభిషేకము అనంతరం ప్రత్యేక అలంకారము, 6వ తేదీన కళ్యాణం ఉత్సవము,7 వ తేదీ సాయంత్రం ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, 8వ తేదీ పుష్ప పల్లకి లో మాడవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. పదవ తేదీ ఆలయం వద్ద ఉట్టి నిర్వహిస్తామన్నారు. భక్తులు కృష్ణాష్టమి వారోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి వారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.






లాడ్జిలపై విస్తృత తనిఖీలు

చిత్తూరు పట్టణములోని 1 టౌన్, 2 టౌన్ పరిధుల్లో గల లాడ్జీలపై విస్తృత తనిఖీలు.

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో లాడ్జీలపై సంబంధిత ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది గురువారం రాత్రి  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.





ఈ ప్రత్యేక తనిఖీలలో భాగంగా లాడ్జీల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, లాడ్జీల్లో బస చేస్తున్న అతిథుల నమోదు విధానం, వారి గుర్తింపు పత్రాలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు , లైటింగ్ సదుపాయాలను పోలీసులు పరిశీలించారు.

లాడ్జీలలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చూడటం, మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణాను అడ్డుకోవడం, మహిళలు మరియు ప్రయాణికుల భద్రతను కాపాడటం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.

తనిఖీల సందర్భంగా లాడ్జీ యజమానులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి లాడ్జీలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. లాడ్జీలో బస చేసే ప్రతి అతిథి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, వారి గుర్తింపు పత్రాలను పరిశీలించి భద్రపరచాలని ఆదేశించారు.


అదేవిధంగా మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం, జూదం మరియు ఇతర అక్రమ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


నిబంధనలు ఉల్లంఘించే లాడ్జీ యజమానులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఐదుగురు అరెస్ట్ : సీఐ చిన్న పెద్దయ్య

చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి – ఐదుగురు అరెస్ట్  : సీఐ చిన్న పెద్దయ్య 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 




చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేనబండ ప్రాంతంలో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్న పెద్దయ్య తన సిబ్బందితో కలసి గురువారం దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు వన్ టౌన్ , టూ టౌన్ పరిధిలో  అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిగా పెంచుతున్నామన్నారు. రాత్రివేళలో గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. నిషేధిత లాటరీ టికెట్టు విక్రయం పేకాట ఆడడం వంటి కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఎవరైనా పట్టణ పరిధిలో అక్రమ జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు తెలియజేయాలని, తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సంరక్షణ పోలీసుల బాధ్యత అన్నారు.

గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

 అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి 

ఆనందంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలని 

- బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 




బంగారుపాళ్యం మండలంలోని ప్రజలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను  ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంతోషకరమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. గురువారం రాత్రి బంగారుపాలెం మండల కేంద్రంలోని నూనె గుండ్ల పల్లిలో గ్రామస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఆ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల కు సంబంధించిన ఏర్పాట్ల పైన అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలసి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలని,  మనస్పర్ధలు, గొడవలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ఎవరైనా గొడవలకు అల్లర్లకు దౌర్జన్యాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఇంటిల్లిపాది శ్రీకృష్ణాష్టమి పర్వదిన వేడుకలను ఆనందంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు



ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్ హేయమైన చర్య

విద్యాశాఖడైరెక్టేట్ ముట్టడి కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులు హేయమైన చర్య - UTF 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


గురువారం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, ప్రత్యేక టెట్లో మార్పులు చేయాలని చలో డైరెక్టర్ రేట్ కార్యాలయంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న యుటిఎఫ్ నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య. 

-యుటిఎఫ్ చిత్తూరు జిల్లా

మంత్రి  గారు వాట్సాప్ ద్వారా ప్రస్తావన చేసిన  మాటను అమలు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే ప్రత్యేక టెట్ లో పాస్ మార్కులు 40 శాతానికి తగ్గించాలని, ఎవరు బోధన చేసే సబ్జెక్టులో వారికి టెట్ నిర్వహించాలని, సీనియర్ ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద యుటిఎఫ్ నిర్వహిస్తున్న ధర్నాను నిర్వీర్యం చేసి ఉపాధ్యాయులను యుటిఎఫ్ రాష్ట్ర మరియు చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రెడ్డప్ప నాయుడు, ఎం మణిగండన్ జిల్లా సహాధ్యక్షులు డి ఏకంబరం మరియు జిల్లా కార్యదర్శులు పిసిబాబు, బి రామ మూర్తి నాయక్, వెంకటేష్ జిల్లాలో వివిధ మండలాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ ని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా సహాధ్యక్షులు ఎస్. రెహానా బేగం, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్పీ బాష, జిల్లా కార్యదర్శి ఎం. పార్థసారథి లు అన్నారు.



 విద్యాశాఖ మంత్రి గారు , విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రేపటి నుండి విజయవాడ రాష్ట్ర కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు రూపంలో  ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.

సైబర్ నేరంలో... భారీ రికవరీ

*సైబర్ నేరంలో అప్రమత్తతతో స్పందించి రూ.2,22,054 మొత్తాన్ని రెండు రోజుల్లో రికవరీ చేసిన చిత్తూరు జిల్లా సైబర్ సెల్ పోలీసులు*

*సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితుడు అప్రమత్తమై సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా భారీ మొత్తాన్ని తిరిగి పొందవచ్చని నిరూపించిన చిత్తూరు జిల్లా పోలీసులు.*

*“సైబర్ మోసానికి గురైతే భయపడకండి… ఆలస్యం చేయకండి… వెంటనే 1930కు కాల్ చేయండి.”*

“Golden Hourను మిస్ కాకండి… మీ డబ్బును కాపాడుకునేందుకు వెంటనే స్పందించండి.”

“మీ అప్రమత్తతే… మీ ఆన్‌లైన్ భద్రతకు తొలి అడుగు.”

జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


సోమల గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి “ట్రాక్టర్‌కు ₹1,000 ఫైన్ పడింది” అంటూ ఒక అపరిచిత మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్‌ను ఓపెన్ చేయగా, ‘mParivahan’ పేరుతో నకిలీ యాప్ అతని ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయింది. అనంతరం కొద్దిసేపటికే ఆయన ICICI క్రెడిట్ కార్డు నుంచి రూ.2,22,054 అనధికారికంగా డెబిట్ అయ్యాయి.


వెంటనే అప్రమత్తమైన బాధితుడు ICICI కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో పాటు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా సైబర్ సెల్ పోలీసులు తక్షణమే స్పందించి, సంబంధిత బ్యాంకింగ్ లావాదేవీలను నిలిపివేయడంతో పాటు నగదు రికవరీ కోసం వేగవంతమైన చర్యలు చేపట్టారు.


పోలీసుల తక్షణ స్పందనతో పాటు బాధితుడు సకాలంలో ఫిర్యాదు చేయడంతో కేవలం రెండు రోజుల్లోనే పోగొట్టుకున్న పూర్తి మొత్తం రూ.2,22,054ను రికవరీ చేసి బాధితుడికి తిరిగి అందించారు.


తనకు జరిగిన సైబర్ మోసంపై చిత్తూరు జిల్లా సైబర్ సెల్ పోలీసులు వెంటనే స్పందించి, తన డబ్బును తిరిగి పొందేలా చర్యలు తీసుకున్నందుకు బాధితుడు చిత్తూరు జిల్లా పోలీసులకు మరియు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి మాట్లాడుతూ సైబర్ నేరాల్లో ప్రతి సెకను ఎంతో కీలకం. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఆందోళనకు గురికాకుండా, ఎటువంటి ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి అన్నారు.


- “సైబర్ నేరంలో Golden Hourలో ఫిర్యాదు చేయడం అత్యంత కీలకం. మోసగాళ్ల ఖాతాల్లోకి నగదు బదిలీ అయిన వెంటనే ఫిర్యాదు చేస్తే, ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేసి బాధితుడి డబ్బును తిరిగి పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.”


- “అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింకులు, APK ఫైళ్లు లేదా అనుమానాస్పద యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయడం లేదా ఇన్‌స్టాల్ చేయడం చేయవద్దు. అధికారిక సంస్థల పేరుతో వచ్చిన సందేశాలను సైతం ముందుగా ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలి.”


- “ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాల నివారణలో మొదటి రక్షణ. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ లావాదేవీలు, పేమెంట్లు మరియు వ్యక్తిగత సమాచార రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.”


జిల్లా ఎస్పీ  సైబర్ క్రైమ్ అధికారులను, సిబ్బందిని అభినందిస్తూ, సైబర్ నేరాలకు గురైన బాధితులకు సత్వర సహాయం అందించి, నగదు రికవరీ కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.


*ప్రజలకు చిత్తూరు జిల్లా పోలీసుల విజ్ఞప్తి*


• అపరిచిత లింకులను ఓపెన్ చేయవద్దు.


• తెలియని APK ఫైళ్లు లేదా అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దు.


• బ్యాంకు/క్రెడిట్ కార్డు వివరాలు, OTP, PIN, CVV వంటి కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.


• సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయండి.


• సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ సెల్‌లో వెంటనే ఫిర్యాదు చేయండి.


• సైబర్ మోసం జరిగిన వెంటనే Golden Hourలో ఫిర్యాదు చేయడం ద్వారా నగదు రికవరీ అవకాశాలను పెంచుకోవచ్చు.


ఏదైనా ఆన్‌లైన్ మోసానికి గురైనట్లు అనిపించిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని జిల్లా పోలీసులు సూచించారు. అలాగే [www.cybercrime.gov.in](http://www.cybercrime.gov.in) పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు, సమీపంలోని సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

డ్రగ్స్ వద్దు బ్రో.. సీఐ కత్తి శ్రీనివాసులు

డ్రగ్స్ వద్దు బ్రో” – విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, ఆదేశాల మేరకు పలమనేరు డి.ఎస్పీ  డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో 9వ, 10వ తరగతి విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సును  ఇన్‌స్పెక్టర్ కత్తి  శ్రీనివాసులు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్  మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు, విద్యాభ్యాసం, భవిష్యత్తు మరియు కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. చెడు స్నేహాలు, ఆకర్షణలకు లోనై మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన అనర్థాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.





సమాజంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1972కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో SI ప్రసాద్, EAGLE టీమ్ ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


Wednesday, 2 September 2026

చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన సిఐగా నరసింహ రాజు

నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కృషి 

ప్రజల సహకారంతో ట్రాఫిక్ క్రంబద్దీకరణ 

- నూతన సీఐ నరసింహారాజు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 





చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన సిఐగా నరసింహ రాజు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. సాంప్రదాయ బద్దంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి , అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ బాబు,  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నర్సింహారాజుకు పండ్లు సమర్పించి దుశాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కానిస్టేబుల్ స్థాయి నుండి సీఐ స్థాయికి ఎదిగానని, అన్ని క్యాడర్ లలో ఉన్న సాధక బాధకాలు తనకు తెలుసు అన్నారు. తన సహచర సిబ్బందితోను, ప్రజలతోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మెలగతూ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తానన్నారు. 



గతంలో సుమారు రెండున్నర సంవత్సరం పాటు వన్ టౌన్ సిఐగా పనిచేసిన అనుభవం ఉందని, జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తామన్నారు. ప్రజల కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకారాలు అందిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

రీ -సర్వేలో తప్పులకుతావివ్వొద్దు

 రీ -సర్వేలో తప్పులకుతావివ్వొద్దు

జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్

చిత్తూరు, సెప్టెంబర్ 2: ఫస్ట్ న్యూస్ 4 యు 


రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న రీ-సర్వే పనులను కచ్చితత్వంతో, పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్  అధికారులను ఆదేశించారు.



బుధవారం జీడి నెల్లూరు, కార్వేటినగరం, ఎస్ఆర్ పురం, మండలాలలో పలు అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు జీడి నెల్లూరు ఎంఆర్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రీ-  సర్వే, సర్వే రికార్డులు, పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసుల నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీ -సర్వేలో ఎటువంటి తప్పులూ దొర్లకుండా క్షేత్రస్థాయిలో సర్వే, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సరిహద్దు వివాదాలకు అవకాశం లేకుండా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. నిర్దేశిత గడువులోగా రీ-సర్వే పనులు పూర్తి చేసి రైతులకు స్పష్టమైన హక్కు పత్రాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని ఆదేశించారు.

 జీడి నెల్లూరు మండలంలో రిసర్వ్ పనులు వేగవంతం చేయాలని రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు మండలంలోని 35 గ్రామాలలో  రీసెర్వె పనులు గ్రామ సభ్యులు నిర్వహించి రీ సర్వే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మండలంలో ఫేసు 4 కింద బుక్కపట్నం, వేపంజేరి, నందనూరు, గ్రామాలలో రీసెర్వె పనులు చేపట్టాలని ఆదేశించారు. ఫేస్ 5 కింద తుమగుండ్రం, జీడి నెల్లూరు, బుజ్జి వెజ్ పల్లి నాయన పల్లి, వెజ్ పల్లి గ్రామాలలో రీ సర్వే పనులు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు టీమ్ గా ఏర్పడి  రీ సర్వే పనులు రెండు రోజుల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సుమారు రెండు వేల ఎకరాలు పెండింగ్లో ఉన్నాయని, తాసిల్దార్ లాగిన్ నుంచి ఆర్డిఓ లాగిన్ కి పంపవలనని సర్వేర్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో C.K. శ్రీనివాసులు, సర్వేయర్ గణేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు