Wednesday, 23 September 2026

చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు

చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు

సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా గాంధీ కూడలి నుండి చర్చి వీధి అంతటా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్  చిన్నపెదయ్య 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

జిల్లా ఎస్పీ  తుషార్ డూడి  ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ జె.వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ  చిన్న పెద్దయ్య చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ  నాగప్ప నాయక్ తో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.



రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు.ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment