ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయిన భవనం ఎలివేషన్
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
సుమారు 60 70 సంవత్సరాల ఒక భవనం యొక్క ఎలివేషన్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కుప్పకూలి పోవడంతో అక్కడే ఉన్నా రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న భవనం తిరుపతికి చెందిన నిర్వాహకుల ది. అందులో దాదాపు పది దుకాణాలు అద్దెకు ఇచ్చారు. ఆ దుకాణం సుమారు 60 ,70 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో ఆ భవనానికి ముందు ఉన్న ఎలివేషన్ ఉన్నపలంగా అకస్మాత్తుగా ఊడి పడడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆ భవనానికి ముందర పార్కింగ్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయింది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు. ప్రస్తుతం ఆ భవనం ముందర మరో రెండు ఎలివేషన్ కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని దుకాణా దారులు స్థానికులు వాపోతున్నారు. ఆ బిల్డింగ్ పైనే ప్రచారానికి సంబంధించిన పెద్ద హోర్డింగ్ బోర్డు కూడా ఉండడంతో, భారీ వర్షం కురిసిన ప్రమాదం జరిగే అవకాశాలు ఉందని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు నగరంలో సుమారు 70 నుండి 100 ఏళ్ళు క్రితం నిర్మించిన పలు భవనాలు ఇదే స్థితిలో ఉన్నాయి. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని పిడుగు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి భవనాలు కుప్పకూలిపోయే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు నగరంలో తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.




No comments:
Post a Comment