కారు డ్రైవర్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.13,000/- జరిమానా
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు గౌరవ న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.13,000/- జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే, 03-11-2023న సాయంత్రం 06:54 గంటలకు చిత్తూరు పట్టణంలోని మారుతి సుజుకి షోరూమ్ ఎదుట చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై మారుతి వాగన్-ఆర్ కారు KA-05-MT-0082 మరియు ఆటో AP39-TB-4772 ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బి. రఘు మృతి చెందగా, ఆటో డ్రైవర్ ఉదయ్ కుమార్ మరియు ఇతర ప్రయాణికులు గాయపడ్డారు.
జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, చిత్తూరు SDPO J. వెంకట నారాయణ ఆధ్వర్యంలో, చిత్తూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ P. నరసింహ రాజు కేసును సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టి సాక్షులను హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవ 3వ ADMM కోర్టు నిందితుడు కె.ఆర్. సుబ్రమణ్య రావుపై నేరం రుజువైనందున ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.13,000/- జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ P. నరసింహ రాజు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, వాహనాలను జాగ్రత్తగా మరియు బాధ్యతాయుతంగా నడపాలని విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment