Wednesday, 9 September 2026

తృటిలో తప్పిన పెను ప్రమాదం

 తృటిలో తప్పిన పెను ప్రమాదం 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



 డ్రైవర్ అప్రమత్తతతో ఓ ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానిక ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమీపంలోని వీరభద్రకాలనీ బ్రిడ్జిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బ్రిడ్జికి నిర్మించిన రేవిట్మెంట్ పాడైపోవడంతో రోడ్డు ఓవైపు కోతకు గురైంది. ఈ విషయం తెలియని ఒక ఉల్లిగడ్డల లారీని లోడ్డుతో సహా   రాజీవ్ నగర్, మహాత్మానగర్ వైపు వెళ్లేందుకు డ్రైవర్ ఆ వంతెన దాటే ప్రయత్నం చేశాడు. అయితే బ్రిడ్జిపై కొంత భాగం ముందుకు పోయిన తర్వాత   వెనుక వైపు కోతకు గురైన రోడ్డులో వెనుక  టైర్లు కిందకు దిగుబడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతతో లారీని కొద్దిగా ముందుకు పోనిచ్చి  నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. లేని పక్షంలో ఉల్లిగడ్డలతోపాటు లారీ కిందికి బోల్తా పడే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న లారీ యజమాని భారీ క్రేన్ ను రప్పించి, దాని సాయంతో దిగుబడిపోయిన లారీని పైకి లేపి ముందుకు పోనిచ్చడంతో అప్పటి వరకు భయాందోళనలతో గడిపిన వీరభద్ర కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్ అధికారులు స్పష్టమైన స్పందించి వీరభద్రకాలనీ వంతెనకు సంబంధించి పాడైపోయిన రేవిట్మెంట్  ను సరిచేయాలని వీరభద్రకాలనీ వాసులు కోరుతున్నారు.

No comments:

Post a Comment