చిత్తూరు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం
*బీఎల్ఓల ద్వారా ఫొటో నాణ్యత పరిశీలనలో 9,20,404 ఫొటోలు ఆమోదం*
*వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ సమావేశం*
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు సెప్టెంబర్ 23:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన మరియు ఇతర సమస్యల పై జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ మాట్లాడుతూ…ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో భాగంగా ఈ నెల కూడా ఓటర్ల జాబితా సవరణ, నోటీసుల జారీ, పరిశీలన వంటి ప్రక్రియల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.
SIR నోటీసులు & క్లెయిమ్‌లు డ్రాఫ్ట్ రోల్లో నమోదైన నోటీసులపై సమగ్ర విచారణ పూర్తిచేసి, అర్హులైన అభ్యర్థుల డేటాను ఫైనల్ పబ్లికేషన్ కోసం పంపడం జరిగింది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, ఫారమ్-6, ఫారమ్-7 మరియు ఫారమ్-8ల దాఖలు ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ, అనర్హులైన లేదా డబుల్ ఎంట్రీలు ఉన్న ఓటర్ల సమాచారాన్ని క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం సవరిస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా నోటీసులు, విచారణలు, ఫారమ్‌ల పరిశీలన, ఫొటో నాణ్యత తనిఖీ తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 170-నగరి, 171-జీడీ నెల్లూరు (ఎస్సీ), 172-చిత్తూరు, 173-పూతలపట్టు (ఎస్సీ), 174-పలమనేరు, 175-కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నోటీసులు – విచారణకు సంబంధించి
సెప్టెంబర్ 22, 2026 నాటికి జిల్లాలో మొత్తం 1,34,307 నోటీసులు జనరేట్ కాగా, అదే సంఖ్యలో నోటీసులు అందజేయడం జరిగింది. మొత్తం 1,34,307 నోటీసులకు సంబంధించి విచారణలు నిర్వహించబడ్డాయి. విచారణ తేదీ ముగిసినవి, రీషెడ్యూల్ అయినవి, ఐదు రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఏవీ లేవని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అలాగే 25,726 కేసులు వెరిఫై చేయగా, 7 కేసులు నాట్ వెరిఫైడ్‌గా నమోదయ్యాయి. తుది ప్రకటనకు అనర్హంగా గుర్తించినవి 2,489 కాగా, తుది ప్రచురణకు సంబంధించి నోటీసులతో 1,31,818 కేసులు, ఇతర కారణాలతో తుది ప్రచురణకు 10,69,754 కేసులు నమోదు అయ్యాయని, ఫారమ్‌ల స్వీకరణ, పరిశీలనకు సంబంధించి
2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు జిల్లాలో వివిధ రకాలుగా మొత్తం 2,22,096 ఫారమ్‌లు సమర్పించబడ్డాయి. ఇందులో 1,40,733 ఆఫ్‌లైన్, 81,363 ఆన్లైన్ ద్వారా సమర్పించబడ్డాయి.
బీఎల్ఓలకు కేటాయించిన ఫారమ్‌లలో 2,887 ఫారమ్‌లు ప్రాసెస్ చేయబడ్డాయి. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయినవి, తదుపరి చర్యలకు పెండింగ్‌లో ఉన్నవి తదితర ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం 7,022 ఫారమ్‌లు బీఎల్ఓల ద్వారా పరిశీలించబడి, 28 ఫారమ్‌లు రీ-రోల్ అప్డేట్ కోసం ఆమోదించబడ్డాయి. మొత్తం 2,10,466 ఫారమ్‌లు రోల్ అప్డేట్కు ఆమోదించబడ్డాయి.
ఫారమ్-6 దరఖాస్తులపై పురోగతికి సంబంధించి
2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు జిల్లాలో మొత్తం 31,931 ఫారమ్-6 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో 31,591 ఆన్లైన్, 340 ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఉన్నాయి.
బీఎల్ఓల ద్వారా 4,192 దరఖాస్తులు పరిశీలించగా, 24,684 దరఖాస్తులు రోల్ అప్డేట్కు ఆమోదించబడ్డాయి. మొత్తం 3,055 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఫొటో నాణ్యత పరిశీలన సంబంధించి
సెప్టెంబర్ 23, 2026 నాటికి జిల్లాలో మొత్తం 12,04,067 మంది ఓటర్లు ఉండగా, 10,52,741 ఫొటోలు అప్లోడ్ అయ్యాయి. వీటిలో బీఎల్ఓల ద్వారా 9,20,404 ఎస్ఐఆర్ ఫొటోలు ఆమోదించబడ్డాయి, అలాగే 2,83,635 ప్రస్తుత ఫొటోలు బీఎల్ఓల ద్వారా ఆమోదించబడ్డాయి.
బీఎల్ఓ స్థాయిలో 28 ఫొటోలు పెండింగ్‌లో ఉండగా, ఈ ప్రక్రియలో బీఎల్ఓ పెండింగ్ శాతం 0.00 శాతంగా నమోదైంది. ఈఆర్ఓ/ఏఈఆర్ఓ స్థాయిలో 19,667 ఫొటోలు పెండింగ్‌లో ఉండగా, పెండింగ్ శాతం 2.14 శాతంగా ఉంది. రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం తమ సూచనలు, అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్టేట్ సెక్రటరీ కె.బాలసుబ్రమణ్యం,బహుజన సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ పి సురేంద్రబాబు, జిల్లా జనరల్ సెక్రెటరీ బిజెపి అట్లూరు శ్రీనివాస్, సిపిఐ పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ వాడ గంగరాజు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ డి రమేష్ బాబు మరియు సిటీ ప్రెసిడెంట్ తికారాం, టిడిపి స్టేట్ అఫిషియల్ స్పోక్ పర్సన్ వి.సురేంద్ర కుమార్, వై ఎస్ ఆర్ సి పి పార్టీ తరపున విజయ సింహా రెడ్డి మరియు ఎన్ ఉదయ్ కుమార్ రెడ్డి, జనసేనా పార్టీ దేవినేని యశ్వంత్ చిత్తూరు జిల్లా సెక్రటరీ, కలెక్టరేట్ ఎన్నికల డిటి రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment