Monday, 7 September 2026

ఐదు మంది నిందితులు అరెస్ట్

 పలు చోరీ కేసులు ఛేదించిన యాదమరి పోలీసులు

ఐదుగురు నిందితుల అరెస్టు.. రూ.4.56 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



యాదమరి, సెప్టెంబర్ 7: యాదమరి పోలీస్ స్టేషన్ పరిధితో పాటు చిత్తూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో నమోదైన పలు చోరీ కేసులను యాదమరి పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, సుమారు రూ.4.56 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.



చిత్తూరు జిల్లా ఎస్పీ సూచనల మేరకు, SDPO ఆదేశాలతో, రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో యాదమరి ఎస్‌ఐ డి. ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం పుల్లయ్యగారిపల్లి సమీపంలోని ఎక్స్‌ప్రెస్ హైవే బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో నాలుగు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




వారి వద్ద ఉన్న ఎల్‌ఈడీ టీవీ, స్పీకర్లపై అనుమానం రావడంతో పోలీసులు విచారించగా పలు చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు తెలిపారు. చిత్తూరులో బజాజ్ పల్సర్, యాదమరి పరిధిలోని ఓ క్లినిక్‌లో శామ్‌సంగ్ ట్యాబ్లెట్, నగదు, పి.కొత్తకోటలోని టీ స్టాల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు, మురకంబట్టులో యమహా ఆర్15, వరిగపల్లిలో హోండా యాక్టివా వాహనాలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment