ద్రావిడియన్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, సెప్టెంబరు 18 ఫస్ట్ న్యూస్ 4 యు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ సెప్టెంబరు 22న చిత్తూరు జిల్లాలోని కుప్పం ద్రావిడియన్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గవర్నర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 22న ఉదయం 10.00 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, ఉదయం 10.40 గంటలకు కుప్పంలోని ద్రావిడియన్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.50 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, 10.55 గంటలకు ద్రావిడియన్ యూనివర్సిటీలోని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఆడిటోరియంకు చేరుకుంటారు.
22.9.26ఉదయం 11.00 గంటల నుంpచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు ద్రావిడియన్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు ఆడిటోరియం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, 12.25 గంటలకు యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 12.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి, మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.
గవర్నర్ పర్యటన సందర్భంగా భద్రత, రిసెప్షన్, వసతి, రవాణా, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లను సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించిన భద్రతా ప్రోటోకాల్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు, ప్రయాణ మార్గాలు, హెలిప్యాడ్, స్నాతకోత్సవ వేదిక వద్ద అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ గవర్నర్ పర్యటన విజయవంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

No comments:
Post a Comment