Saturday, 12 September 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 30 మందికి భారీ జరిమానా

 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 30 మందికి భారీ జరిమానా 

- ట్రాఫిక్ సిఐ నరసింహారాజు 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 30 మందికి నేషనల్ మెగా లోక్ అదాలత్ లో భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నరసింహారాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో జరిపిన ఆకస్మిక వాహనాల తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మందిని కోర్టుకు హాజరుపరచగా నేషనల్ మెగా లోక్ అదాలతో 30 మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 3 లక్షల రూపాయలు భారీ జరిమానాలను జడ్జ్ విధించినట్లు తెలిపారు. దీంతోపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారం నిర్వహిస్తున్న 211 మందికి రూ.10,550 జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని అలా చేస్తే భారీ జరిమానా తో పాటు పునరావృతం అయితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం రోడ్డు నిబంధనలు పాటించడం చేయాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా దుకాణా దారులు పాదాచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నిర్వహించాలని, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి రోడ్డు వైపు వ్యాపారం నిర్వహిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ , రాష్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా తగిన ఆధారాలు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన, మైనర్లకు వాహనాలు, ఇచ్చిన మైనర్లు వాహనాలు నడిపిన , త్రిబుల్ రైడింగ్ చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments:

Post a Comment