కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కుప్పం ASP హేమంత్ బొడ్డు,కి విధులపై దిశానిర్దేశం
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
కుప్పం సబ్-డివిజన్ నందు త్వరలో జరగనున్న ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఈరోజు కుప్పం ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు పర్యటించనున్న ప్రదేశాలను పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులు, హెలిప్యాడ్, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వేదిక పరిసర ప్రాంతాల భద్రత తదితర అంశాలను జిల్లా ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు.
అనంతరం ఇటీవల కుప్పం ASPగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ బొడ్డు, కి కుప్పం సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం, సిబ్బంది సమన్వయం, ముఖ్యమైన కేసుల పర్యవేక్షణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు పోలీసు శాఖపై మరింత నమ్మకం కలిగేలా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ASP హేమంత్ బొడ్డు, కి జిల్లా ఎస్పీ గసూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి, పర్యటన విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కుప్పం ASP హేమంత్ బొడ్డు,, ఎస్.బి. ఇన్స్పెక్టర్ మురళి, కుప్పం సబ్-డివిజన్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment