Wednesday, 30 September 2026

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత * ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత

* ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ 




* నగరపాలక పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: నగరంలో మెరుగైన పారిశుధ్యం కోసం, ప్రజల ఆరోగ్య కోసం నిరంతరం శ్రమించే నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. స్వచ్ఛతా హీ సేవా -2026 కార్యక్రమాల్లో భాగంగా బుధవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నగరపాలక పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. కార్మికుల శ్రమని తగ్గించి సులభంగా పనులు చేసేలా ఆధునిక పనిముట్లను అందుబాటులోకి తేవాలన్నారు. పనిచేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రక్షణ పరికరాలను వాడాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో చిత్తూరు నగరపాలక సంస్థ గత ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల అధికారులను, పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. 

కమిషనర్ పి నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ.. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను సాల్వతో సత్కరించారు. పారిశుద్ధ్య పనులు నిర్వహణకు సంబంధించి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.

వైద్య శిబిరంలో భాగంగా జనరల్ మెడిసిన్, డెంటల్, గైనిక్, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పదిమంది వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇతర వైద్య పరీక్షల అనంతరం మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  కమిషనర్ పి నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్, ఎంహెచ్వో డా.అనిల్ కుమార్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్  త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ మేయర్ అముద, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, గోపాలకృష్ణ, వెంకటేష్ యాదవ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment