ఆధ్యాత్మిక రంగంలో సాటిలేని మేటి గురువు పత్రీజీ.... MLC కంచెర్ల శ్రీకాంత్ చౌదరి.
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక రంగంలో సాటిలేని మేటి గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ అని, అలాంటి గురువు మనకు లభించడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ప్రభుత్వ విప్ మరియు MLC కంచెర్ల శ్రీకాంత్ చౌదరి పేర్కొన్నారు.
కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహా శక్తి క్షేత్రం నందు చీఫ్ ఆర్గనైజర్ డాక్టర్ గోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు రోజుల ధ్యాన మహా యజ్ఞం ముగింపు రోజున ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
ధ్యానం యొక్క ప్రాముఖ్యతను, వివరిస్తూ రాజకీయ నాయకుడిగా సరైన నిర్ణయాలు తీసుకోవడం లోను, ఒత్తిడిని సమర్థ వంతంగా ఎదుర్కోవడం లోను ధ్యానం తనకు ఎంతగానో సహాయపడు తోందని తన అనుభవాలను పంచుకున్నారు.
పిరమిడ్ ఆశ్రమం లోని రుద్రపీఠం మరియు క్రిస్టల్ పిరమిడ్ లో కొంత సేపు ధ్యానం చేశారు. బోధి వృక్షం తదితర విశిష్ట ప్రదేశాలను సందర్శించి వాటిని గురించి వివరాలు తెలుకున్నారు. పిరమిడ్ శక్తి క్షేత్రంలో చేపడుతున్న ధ్యాన, ఆధ్యాత్మిక మరియు సేవ, నిత్య అన్నదాన కార్య క్రమాలను గురించి తెలుసుకుని ప్రత్యేకంగా నిర్వాహకులను ప్రశంసించారు.
ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం మరియు ధ్యాన కార్య క్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఇంత గొప్ప కార్య క్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు గోపాల కృష్ణ మూర్తి, వారి కుటుంబ సభ్యులను, వారికి సహకరించిన సేవకులు, వాలంటీర్లను అభినందించారు. గౌరవ నీయులు ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత చురుకుగా అద్భుతంగా పరిపాలిస్తున్నారంటే దానికి కారణం క్రమం తప్పకుండా యోగ, మెడిటేషన్ చేయడమే నన్నారు.
పూతలపట్టు శాసన సభ్యులు శ్రీ మురళీ మోహన్ గారు, దిలీప్, సుకుమార్, వెంకటేశ్వర చౌదరి, గణపతి నాయుడు ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మురళీ మోహన్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ క్షేత్రం గురించి నాకు తెలియదని, ఇక్కడ కూర్చున్న అరగంటకే ఎంతో ఆత్మా నందం పొందానని తప్పకుండా వీలు దొరికినప్పుడు ఇక్కడకు వచ్చి కొంత సేపు ధ్యానం చేసుకుంటానని చెప్పారు. ధ్యానుల కోరిక మేరకు ఈ క్షేత్రానికి సిమెంట్ రోడ్డు మరియు వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తానని మాట ఇచ్చారు. ఇంత అద్భుతంగా ధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
వైజాగ్ నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వంశీ కిరణ్ గారు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ధ్యాన రత్న , గాన తుంబుర శ్రీ పిప్పెల్ల ప్రసాద్ గారు తన గాణాంబృతం తో సభికులను మైమరపించారు.
తూర్పు గోదావరి జిల్లా లోని నాగాయలంక నుండి వచ్చిన సాంస్కృతిక బృందం అత్యుత్భుత మైన తమ నాట్య ప్రదర్శనతో ధ్యానాభి లాషులను ఉత్సాహ పరిచారు.
ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దాదాపు 5,000 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నిర్వాహకులు గోపాల కృష్ణ మూర్తి వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథిని, ఇతర ఆహ్వానితులను, వాలంటీర్లను, డోనార్స్ ను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ మూడు రోజుల ధ్యాన మహా యజ్ఞం అంగ రంగ వైభవంగా ముగిసినందుకు, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహా కరించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్య వాదాలు తెలియ జేశారు.


No comments:
Post a Comment