అభివృద్ధి, సంక్షేమాన్ని అందించి స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తున్నాం..
* కూటమి పార్టీలు ఐక్యంగా పోటీ చేస్తాయి
* అన్ని స్థానాలు గెలుస్తాం
* జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజల ముందుకు వెళ్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. శనివారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జి కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు, జిల్లా తెదేపా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, భాజపా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, ఇతర ముఖ్య కూటమి నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024 సాధారణ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఏడు స్థానాల్లో కూటమి పార్టీ గెలిచిందని, ఇదే తరహాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఐక్యమత్యంగా పోటీ చేసి వందశాతం విజయాలు సాధిస్తామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాట్లపై చర్చించామని, తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయక.. దొడ్డిదారిన ఎన్నికలు నిర్వహించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు వైకాపా ప్రజల పక్షాన ఏనాడు పోరాటం చేయలేదని, ప్రతిపక్ష పాత్ర పోషించలేదని విమర్శించారు. ఒక్కరోజు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యల ప్రస్తావించలేదన్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి గారికి బహుమతిగా అందిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
-------//--------

No comments:
Post a Comment