Sunday, 27 September 2026

కాపర్ వైర్ల చోరీ కేసు ఛేదింపు – 4 గురు అరెస్ట్ - 15 లక్షల విలువ గల 280 కిలోల కాపర్ వైర్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

*కాపర్ వైర్ల చోరీ కేసు ఛేదింపు – 4 గురు అరెస్ట్ - 15 లక్షల విలువ గల 280 కిలోల కాపర్ వైర్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.*


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

చిత్తూరు జిల్లా ఎస్పీ  తుషార్ డూడి  ఆదేశాల మేరకు కుప్పం సబ్-డివిజన్ ASP  బొడ్డు హేమంత్, పర్యవేక్షణలో, కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ . మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కాపర్ వైర్ల చోరీ కేసును ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

*కేసు వివరాలు:*

2026 జూలై 18వ తేదీన గుడుపల్లి మండలం పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ABIS కంపెనీలో కాపర్ వైర్లు చోరీ జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు గుడుపల్లి పోలీస్ స్టేషన్‌లో Cr.No.55/2026 U/s 303(2) BNS కింద కేసు నమోదు చేశారు.


కేసును ఛేదించేందుకు కుప్పం రూరల్ CI ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా **CCTV ఫుటేజ్‌ను పరిశీలించగా మూడు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వ్యక్తులు వచ్చినట్లు** గుర్తించారు.


అదేవిధంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నిందితుల కదలికలను విశ్లేషించి వారి ఆచూకీని గుర్తించారు.


దర్యాప్తులో నిందితులు చోరీ చేసిన కాపర్ వైర్లను కొద్దికొద్దిగా **కుప్పం మరియు తమిళనాడులోని పాత సామాన్ల దుకాణాల్లో విక్రయించినట్లు** వెల్లడైంది. నిందితులు గతంలో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.


అరెస్ట్ చేసిన నిందితులు:


A-1: M. మధు (24), ఇతనిపై కర్ణాటక రాష్ట్రం, చింతామణి తాలూకా, బట్లహళ్లి పోలీస్ స్టేషన్‌లో Cr.No.22/2026 U/s 303(2) BNS కింద వైరు దొంగతనం కేసు నమోదై ఉంది.


*A-2: V. సంతోష్ (21)*


*A-3: V. మురుగన్ (30)*


*A-4: A. విజయ్ (30)*


*స్వాధీనం చేసుకున్న సొత్తు:*


1. *సుమారు 280 కిలోల రాగి (కాపర్) వైర్లు*

2. *Hero Splendor+ XTEC* – AP40HJ5385

3. *TVS Jupiter 125* – AP40AJ2409


*చోరీకి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.*

ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన కుప్పం రూరల్ CI J. మల్లేశ్ యాదవ్, గుడుపల్లి SI  D. శ్రీనివాసులు, రాళ్లబూదుగూరు SI  I. నరేశ్, హెడ్ కానిస్టేబుల్స్ అనిల్ కుమార్, నటరాజ్, PCలు రత్నప్ప, హరీష్, రామకుమార్, కుమారాచారి, మంజునాథ్, అరుణాచలం, రాజేంద్రలను ఎస్పీ  అభినందించారు.

No comments:

Post a Comment