మైనర్లు వాహనాలు నడపరాదు
తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు
ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి
- ట్రాఫిక్ సీఐ నరసింహారాజు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
మైనర్ లు వాహనాలు నడపరాదని ట్రాఫిక్ సిఐ నరసింహారాజు తెలిపారు. శుక్రవారం మురుగానపల్లి కేశవరెడ్డి పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండని మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్య నేరం అన్నారు. తల్లితండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. ఒకవేళ మైనర్లు వాహనాలు నడిపిన దానివల్ల ఏదైనా ప్రమాదాలు జరిగిన తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేయడమే కాకుండా భారీ జరిమానా విధిస్తామన్నారు. రోడ్డుపైన విద్యార్థులు నడిచేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా లైన్ పైన నడవాలని, తల్లిదండ్రులతో ద్విచక్ర వాహనంలో వచ్చేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పైన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వలన కలిగే లాభాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, పాఠశాల ప్రిన్సిపల్ ముఖిద్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు


No comments:
Post a Comment