మహిళలు, బాలికల భద్రతతో పాటు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం – మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోహన్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
గుడిపాల మండలంలోని CNR డిగ్రీ కళాశాల మరియు పాఠశాలలో మహిళలు, బాలికల భద్రతతో పాటు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్పీ బి. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ ఎస్.ఐ. సుబ్బారెడ్డి తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మోహన్ మాట్లాడుతూ, మహిళలు, బాలికలపై జరిగే నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నేరాలను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణ, నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
అలాగే, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసలుగా మారకుండా విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.
మహిళల భద్రత కోసం ఉపయోగపడే శక్తి యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు, బాలలపై వేధింపులు, నేరాలు జరిగినా లేదా జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం 112, సైబర్ నేరాలపై ఫిర్యాదులకు 1930, ఈగల్ అత్యవసర నంబర్ 1972 గురించి వివరించారు.
మహిళలు, బాలల భద్రతతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఎలాంటి నేరం లేదా మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ. వెంకటేశులు, ఈగల్ టీం సభ్యులు కుమార్, కళాశాల ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment